- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దేవత లాంటి మనిషిని నాశనం చేశారు.. సంచలన కామెంట్స్ చేసిన నటి

దిశ, సినిమా: సినీనటి పూనమ్ కౌర్ ఫిల్మ్ ఇండస్ట్రీ పై సంచలన ఆరోపణ చేసింది. చిత్ర పరిశ్రమలో కొంతమంది తన జీవితాన్ని నాశనం చేశారని.. మూడేళ్లుగా వ్యక్తిగతంగా, ఆరోగ్యపరంగా ఎంతో నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. తను నటించిన తాజా చిత్రం 'నాతిచరామి' ఓటీటీ వేదికగా విడుదలవుతున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన పూనమ్.. ఎన్నో పెద్ద చిత్రాల్లో నటించే అవకాశమొచ్చినా కొందరు రావణుల్లా వెంటపడి చెడగొట్టారని తెలిపింది. అలాగే సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించే మధ్య తరగతి కుటుంబంలో పుట్టానని, కుటుంబ సభ్యులు ఒక దేవతగా పెంచారన్న నటి.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేయకుండా సీతాదేవి, ద్రౌపది, దుర్గాదేవి స్ఫూర్తితో ప్రయాణాన్ని మొదలు పెట్టానని చెప్పింది. కాగా ఎంతో మంది ఆడపిల్లల జీవితం, పెళ్లి, కలలను సాకారం చేసుకునే దిశగా 'నాతిచరామి' చిత్రం ప్రేరణగా నిలుస్తుందని వెల్లడించింది.