- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హడలెత్తిస్తున్న అడవి జంతువు.. ఇప్పటికే 40కి పైగా మేకలు, గొర్రెలు హతం..
దిశ, వంగూరు : నాగర్ కర్నూలు జిల్లా, వంగూరు మండలం రంగాపూర్ గ్రామంలో వరుసగా ఓ అడవి జంతువు మేకలు, గొర్రెలపై దాడులకు పాల్పడుతూ హతమారుస్తూ ఉంది. బుధ, గురు వారాలలో వరుసగా శ్యామ బాల చంద్రయ్య అనే వ్యక్తికి సంబంధించిన ఏడు గొర్రెలను ఒక రోజు, మరో రోజు ఆరు గొర్రెలను హతమార్చింది. గత 25 రోజుల నుండి ఆ జంతువు జరిపిన దాడుల్లో 40కిపైగా గొర్రెలు, మేకలు మరణించాయి.
ఈ విషయంపై స్పందించిన అటవీశాఖ అధికారులు గొర్రెలు, మేకలపై జరిగిన దాడులు, అడుగుజాడలను గుర్తించి పాల్పడుతున్నది చిరుత పులి కాదు అని.. హైన వంటి అడవి జంతువు దాడులకు పాల్పడుతూ గొర్రెలు, మేకలను హతమార్చినట్లు గుర్తించారు. గొర్రెలు మేకలు ఎక్కడ ఉంటే అక్కడికి ఆ అడవి జంతువు వచ్చి దాడులకు పాల్పడుతోందని, ఆ జంతువు నుండి తమ గొర్రెలు మేకలను రక్షించుకునేందుకు అటవీశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.