అప్పులు తీర్చలేక వ్యక్తి ఆత్మహత్య

by Nagaya |
అప్పులు తీర్చలేక వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, ముత్తారం : వ్యవసాయ పెట్టుబడి, కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు తీరక.. వాటికి వడ్డీలు పెరిగిపోవడం, అప్పులు తీర్చే మార్గం కనిపించక మనోవేదనతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ముత్తారం మండలంలోని ఓడేడులో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, ముత్తారం ఎస్ఐ బేతి రాములు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓడేడు గ్రామానికి చెందిన కందికట్ల రవీందర్ (45) వ్యవసాయం తోపాటు కిరాణా షాపు నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. వ్యవసాయ పెట్టుబడితోపాటు కిరాణా షాప్ కోసం అప్పులు తెచ్చాడు. ఇవ్వేకాకుండా కూతురు పెళ్లి కోసం తెచ్చిన అప్పులకు వడ్డీ పెరిగిపోయింది. మరోవైపు వచ్చిన కొద్దిపాటి ఆదాయం కుటుంబ అవసరాలకే సరిపోకపోవడంతో అప్పులు తీర్చే మార్గం లేక మనోవేదనతో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి స్థానిక వైద్యునితో పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య సరస్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ముత్తారం ఎస్ఐ రాములు తెలిపారు.

Advertisement

Next Story