- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఓడరేవులో భారీ పేలుడు.. 14 కు చేరిన మృతుల సంఖ్య

దిశ, వెబ్ డెస్క్: దక్షిణ ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ సమీపంలో ఉన్న షాహిద్ రాజాయీ ఓడరేవు (Shahid Rajaee Port)లో శనివారం మధ్యాహ్నం అత్యంత భారీ పేలుడు (Huge explosion) సంభవించింది. ఈ పేలుడు దాటికి సమీపంలో 5 కిలోమీటర్ల వరకు భూమి కంపించినట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. కాగా ఈ భారీ పేలుడు కారణంగా గాయాలపాలైన వారిలో 14 మంది మృతి చెందారు. అలాగే మరో 750 మందికి పైగా గాయపడ్డారు. వారందరికీ వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తుండగా.. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. షాహిద్ రాజాయీ ఓడరేవు ఇరాన్‌లోని అతిపెద్ద వాణిజ్య ఓడరేవు (Largest commercial port). హోర్మోజ్గాన్ ప్రావిన్స్‌లోని బందర్ అబ్బాస్ సమీపంలో ఉంది. ఈ ఓడరేవు స్ట్రాట్ ఆఫ్ హోర్ముజ్ సమీపంలో ఉండి, ఏటా సుమారు 80 మిలియన్ టన్నుల వస్తువుల రవాణా చేస్తుంది. సీనా కంటైనర్ యార్డ్‌లోని పలు కంటైనర్లలో పేలుడు సంభవించింది.
పేలుడు సంభవించిన కంటైనర్లలో సోడియం పెర్‌క్లోరేట్, అమ్మోనియం పెర్‌క్లోరేట్ వంటి రసాయనాలు ఉండటంతో ఈ పేలుడు జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ పేలుడు ఫలితంగా ఓడరేవులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన నల్లని పొగ ఆకాశంలోకి ఎగిసిపడడంతో పది కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపించింది. పేలుడు సందర్భంగా వచ్చిన షాక్‌వేవ్ కారణంగా సమీపంలోని భవనాల కిటికీలు ధ్వంసమయ్యాయి. ఒక భవనం పూర్తిగా కూలిపోయిందిని, 50 కిలోమీటర్ల దూరంలో కూడా పేలుడు ప్రభావం అనుభవించ బడిందని స్థానిక వార్తలు తెలుపాయి. కాగా ఈ పేలుడుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.