నీటిలో తేలుతున్న ఆరు కిలోల రాయి.. 'రామసేతు'కు చెందినది అంటూ..

by sudharani |   ( Updated:2023-07-08 13:19:52.0  )
నీటిలో తేలుతున్న ఆరు కిలోల రాయి.. రామసేతుకు చెందినది అంటూ..
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా నీటిలో చిన్న రాయి వేస్తేనే అది వెంటనే మునిగిపోతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఉత్తరప్రదేశ్‌ మెయిన్‌పురిలోని ఇసాన్ నదిలో ఒక పెద్ద రాయి నీటిలో తేలుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇసాన్ నది థానా బేవార్ ప్రాంతంలోని అహిమల్‌పూర్ గ్రామానికి చెందిన కొందరు చిన్నారులు.. నదిలో చేపల వేటకు వెళ్లినపుడు.. తేలుతున్న రాయిని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. అంతేకాదు ఆ రాతిపై 'రామా' అని రాసి ఉండటంతో గ్రామస్తులు ఆ రాయిని చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. రాముడు సీతమ్మను రావణుడి చెర నుంచి రక్షించేందుకు సముద్రంపై వానర సేన నిర్మించిన వంతెన 'రామసేతు'తో ఈ రాయి ముడిపడి ఉందని నమ్ముతున్నారు. కాగా ఆరు కిలోలు ఉన్న ఈ రాయిని పూజ కోసం దేవాలయం దగ్గర ప్రతిష్టించాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story