వారంలో రష్యా దాడుల్లో 300 మంది మృతి.. ఉక్రెయిన్ అధికారులు

by Vinod kumar |
వారంలో రష్యా దాడుల్లో 300 మంది మృతి.. ఉక్రెయిన్ అధికారులు
X

కీవ్: రష్యా దాడుల్లో గత వారం 300 మందికి పైగా మరణించారని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. వందల మంది ఆశ్రయం పొందిన ఓ థియేటర్‌పై జరిపిన దాడిలో 300 మంది మరణించారని శుక్రవారం తెలిపారు. 'ప్రత్యక్షసాక్షులు నుంచి సేకరించిన సమాచారం ప్రకారం మరియాపూల్‌లోని డ్రామా థియేటర్‌పై రష్యా వైమానిక దాడుల్లో 300 మంది మరణించారు' అని పేర్కొంది. కాగా, మరియా పూల్ ప్రాంతాన్ని చేజిక్కించుకునేందుకు రష్యా తీవ్రంగా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ దాడుల్లో మహిళలు, చిన్న పిల్లలపై ప్రభావం ఎక్కువగా ఉందని అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు.

'శుక్రవారం థియేటర్ రష్యా తీవ్రమైన దాడిలో ధ్వంసమైంది. ఈ భవనంలో పౌరులు ఆశ్రయం పొందుతున్నారని రష్యాకు తెలుసని పేర్కొంది' అని తెలిపారు. ఇప్పటికే లక్ష మందికి పైగా మరియాపూల్‌లో నీరు, తిండి లేకుండా అవస్థలు పడుతున్నారని జెలెన్ స్కీ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed