'రష్యా బలగాలు ఉపసంహరణ.. వీధుల్లో మృతదేహాలు'

by Manoj |
రష్యా బలగాలు ఉపసంహరణ.. వీధుల్లో మృతదేహాలు
X

న్యూఢిల్లీ: రష్యన్ దళాల ఉపసంహరణ ప్రారంభించడంతో ఉక్రెయిన్ లో భయానక దృశ్యాలు బయటపడుతున్నాయి. రాజధాని కీవ్ నగరానికి సమీపంలోని ఒక పట్టణంలోని వీధిలో రోడ్డుపై 20 మృతదేహాలు కనిపించాయని స్థానిక జర్నలిస్టులు తెలిపారు. వీరిలో చాలా మంది చేతులు కట్టేసి పడవేసి ఉన్నట్లు వెల్లడించారు. మరో ప్రాంతంలో మొండెం వేరు చేసి ఉన్న మృతదేహం కనిపించినట్లు చెప్పారు.

అయితే ఈ మరణాలకు గల కారణాలు వెంటనే తెలియలేదని పేర్కొన్నారు. ఈ మధ్యనే రష్యా బలగాలు ఉపసంహరణతో బుచా విముక్తి పొందినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. అయితే ఆ నగరం క్షిపణుల దాడులో పెద్ద గుంతలు, ధ్వంసమైన భవనాలు, దెబ్బతిన్న కార్లు దర్శనమిచ్చినట్లు తెలిపారు. కాగా, మరణించిన వారిలో చాలా మేరకు సాధారణ పౌరులే ఉన్నారని చెప్పారు.

Next Story