తెలుగు ‘దృశ్యం 2’ గ్రాండ్ లాంచ్

by Jakkula Samataha |
తెలుగు ‘దృశ్యం 2’ గ్రాండ్ లాంచ్
X

దిశ, సినిమా : మోహన్ లాల్ హీరోగా వచ్చిన మలయాళీ థ్రిల్లర్ ఫిల్మ్ ‘దృశ్యం 2’ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కాగా ఇప్పుడు ఈ చిత్రం తెలుగులోనూ రీమేక్ కానుంది. విక్టరీ వెంకటేష్, మీనా జంటగా నటించిన తెలుగు దృశ్యంకు ఇది సీక్వెల్ కాగా.. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఒరిజినల్ ఫిల్మ్‌ డైరెక్ట్ చేసిన జీతు జోసెఫ్ తెలుగులో తొలిసారి ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండగా.. అనూప్ రూబెన్స్ సంగీతం అందించనున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్, ఆశిర్వాద్ సినిమాస్, రాజ్ కుమార్ థియేటర్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో నదియా, నరేశ్, ఎస్తర్ అనిల్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

Advertisement

Next Story