భార్యతో డాన్స్ చేస్తూ స్టేజిపైనే కుప్పకూలి భర్త మృతి.. తన వివాహ వార్షికోత్సవ వేడుకల్లోనే ఘటన

by Ramesh N |   ( Updated:2025-04-05 05:32:38.0  )
భార్యతో డాన్స్ చేస్తూ స్టేజిపైనే కుప్పకూలి భర్త మృతి.. తన వివాహ వార్షికోత్సవ వేడుకల్లోనే ఘటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: తన భార్యతో కలిసి డాన్స్ చేస్తుండగా వేదికపై అకస్మాత్తుగా కుప్పకూలిపోయి భర్త మృతి చెందిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ - బరేలీలో (Wasim Sarwat) వసీం సర్వత్(50) అనే షూ వ్యాపారి తన 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా, స్టేజీపై భార్యతో డాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. తన వివాహ వార్షికోత్సవం రోజు అది కూడా స్టేజీపై అకస్మాత్తుగా (heart attack) గుండెపోటుతో చనిపోవడంతో వారి కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. కాగా, స్టేజీపై డాన్స్ చేసిన తర్వాత అతని భార్య ఫరా తో కలిసి కేక్ కట్ చేయాలని అనుకున్నారు. వేదికపై భార్యతో డాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. అతని భార్య, పార్టీలో ఉన్నవారు వెంటనే అతని వద్దకు వచ్చారు. కానీ అతడు స్పందించలేదు. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. కానీ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మధ్యకాలంలో డాన్స్ చేస్తూ, క్రీడలాడుతూ, జిమ్‌లో వ్యాయామం చేస్తూ వయస్సుతో సంబంధం లేకుండా హఠాత్‌గా కుప్పకూలిపోతున్న సంఘటనలు ఎక్కువవుతున్నాయి. మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, రెగ్యులర్ చెకప్‌లు చేయించుకోవడం, జీవనశైలిని సంతులనంగా ఉంచుకోవడం అత్యవసరమని ఓ నెటిజన్ ఆసక్తికర కామెంట్ పెట్టారు. ‘గుండె సమస్యల కారణంగా ఇలాంటివి జరుగుతాయి. రక్త ప్రవాహం లేదా హృదయ స్పందనలో సమస్య ఉంటే అకస్మాత్తుగా గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. మీరు శ్వాస ఆడకపోవడం లేదా సక్రమంగా లేని హృదయ స్పందన వంటి లక్షణాలు కలిగిఉంటే వైద్యుడికి చూపించాలి’ అని ఓ సీనియర్ కార్డియాలజిస్ట్ తెలిపారు.



Next Story

Most Viewed