సినిమా ఏమోగానీ.. గర్భం దాల్చే ఛాన్స్ ఇచ్చాడు.. ఆపై అక్కడ పట్టుకుని చిత్రహింసలు

by Anukaran |   ( Updated:2021-07-12 02:08:17.0  )
crime news
X

దిశ, వెబ్‌డెస్క్: సినిమా.. ఓ రంగుల ప్రపంచం.. ఇక్కడ ఎంత నిజాయితీ పరులు ఉంటారో అంతకంటే ఎక్కువ మాయగాళ్లు ఉంటారు. వారిని నమ్మి చేరువైతే జీవితాన్ని నరకంగా మార్చేస్తారు. ఇలా ఎంతోమంది హీరోయిన్లు తమ జీవితాలను నాశనం చేసుకున్న సంఘటనలు చాలానే చూశాం. హీరోయిన్ గా ఛాన్స్ ఇప్పిస్తానని, ప్రేమ పేరు చెప్పి వారిని శారీరకంగా వాడుకొని వదిలేస్తారు. తాజాగా ఓ యువ నటిని ఓ నటుడు ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసిన ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది.

వివరాలలోకి వెళితే.. ప్రకాశం జిల్లా ఉయ్యాలవాడ మండలం సింగంపల్లి గ్రామానికి చెందిన మాలపాటి రామకృష్ణ యూసుఫ్‌గూడ సమీపంలోని రహమత్‌నగర్‌లో అద్దెకుంటూ ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువతి హీరోయిన్ అవ్వాలనే ఆశతో ఆరునెలల క్రితం హైదరాబాద్ కి వచ్చింది. ఈ నేపథ్యంలోనే రామకృష్ణ నటిస్తున్న చిత్రంలోనే యువతికి కూడా ఛాన్స్ రావడంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. షూటింగ్ నడుస్తుండగానే వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే అక్క ఇంట్లో ఉంటున్న యువతిని తన రూమ్ కి తీసుకువెళ్లి కామ వాంఛలు తీర్చుకున్నాడు యువకుడు. దీంతో ఆమె గర్భం దాల్చగా.. గర్భవతి అయితే అవకాశాలు రావని మభ్యపెట్టి అబార్షన్‌ చేయించాడు. ఆ తర్వాత కూడా ఆమెపై పలుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

కొన్ని రోజులు గడిచాక రామకృష్ణ ప్రవర్తనలో మార్పు వచ్చింది. యువతిని కొట్టడం ప్రారంభించాడు. ఆమెను అనుమానిస్తూ అసభ్య పదజాలంతో దూషిస్తూ వేధించేవాడు. అంతేకాకుండా మూడు రోజుల క్రితం ఆమె ఉంటున్న నల్లకుంటకు వెళ్లి అసభ్యకరంగా తిట్టడంతో పాటు జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వచ్చి కొట్టాడు. నిన్ను పెళ్లి చేసుకునేది లేదని ఏం చేసుకుంటావో చేసుకోవాలంటూ బెదిరించాడు. దీంతో యువతి తానూ మోసపాయానని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story