రేవంత్ ఇలాఖాలో KTR క్రేజ్.. ఉత్సాహంలో సంచలన హామీ (వీడియో)

by GSrikanth |   ( Updated:2023-11-11 15:53:59.0  )
రేవంత్ ఇలాఖాలో KTR క్రేజ్.. ఉత్సాహంలో సంచలన హామీ  (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మంత్రి కేటీఆర్ కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా నగర కూడలిలో బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డితో కలిసి రోడ్ షో నిర్వహించారు. కాగా, ఈ రోడ్ షోకు బీఆర్ఎస్ కార్యకర్తలు, కేటీఆర్ అభిమానులు భారీగా వచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘రేవంత్ రెడ్డి ఇలాఖాలో కేటీఆర్ క్రేజ్’ అంటూ నెట్టింట్లో బీఆర్ఎస్ శ్రేణులు పోస్టులు పెడుతున్నారు.

అనంతరం రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడారు. కొడంగల్‌లో ఈసారి నరేందర్‌రెడ్డిని గెలిపించిన తర్వాత.. అవసరమైతే కేసీఆర్‌ కాళ్లు పట్టుకుని అయినా సరే ఎమ్మెల్యేకు ప్రమోషన్‌ ఇప్పిచ్చే బాధ్యత తనది అని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. అప్పుడు కొడంగల్‌ ప్రజలకు ఏ ఢోకా ఉండదన్నారు. మీకు ఏది కావాలంటే అది నరేందర్‌ రెడ్డే చేసే స్థాయికి తీసుకొచ్చే బాధ్యత తనదని రెండోసారి పునరుద్ఘాటించారు. కొడంగల్‌లో ఉత్సాహం చూస్తుంటే.. అది ఎలక్షన్‌ ర్యాలీ లెక్క లేదని.. గెలిచినంక తీస్తున్న ర్యాలీలా ఉందని కేటీఆర్‌ అన్నారు. యాడున్నడో కానీ.. ఇదంతా రేవంత్‌ రెడ్డి మనుషులు కూడా చూస్తున్నారని.. ఈ లొల్లి అంత చూసి తర్వాత.. మల్ల ఎందుకు ఓడిపోవాలని ఈ నెల 15న రేవంత్‌ రెడ్డి నామినేషన్‌ వెనక్కి తీసుకున్నా తీసుకుంటాడని ఎద్దేవా చేశారు.


Advertisement

Next Story