- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్‌కు మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ రాజీనామా
దిశ, కల్వకుర్తి: బీఆర్ఎస్‌కు మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ రాజీనామా చేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును ఓడించి జాయింట్ కిల్లర్‌గా పేరుగాంచిన చిత్తరంజన్ దాస్ 2018లో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్‌లో చేరారు. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వైఖరి పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. పలు సందర్భాలలో బహిరంగంగానే విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు కాకుండా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి, లేదా బీసీ నేతలలో ఒకరికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేకే తిరిగి అధికార పార్టీ టికెట్ ఇవ్వడంతో కొన్నాళ్లు మౌనంగా ఉండి.. చివరకు శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు.. భారతీయ జనతా పార్టీలో చేరాలని చేయించుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన స్వగృహంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో బీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తూ అధిష్టానానికి లేఖ పంపినట్లుగా ప్రకటించారు. ప్రధానమంత్రి పాలమూరు పర్యటనలో భాగంగా భూత్పూర్ వద్ద జరిగే బహిరంగ సభలో బీజేపీలో చేరుతానని మాజీ మంత్రి వెల్లడించారు.