మల్లిఖార్జున్ ఖర్గే తెలంగాణ పర్యటన వాయిదా

by GSrikanth |   ( Updated:2023-08-15 15:17:17.0  )
మల్లిఖార్జున్ ఖర్గే తెలంగాణ పర్యటన వాయిదా
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్​ఖర్గే సభ షెడ్యూల్ మారింది. ఈనెల 18న రాష్ట్రంలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. చేవెళ్ల, జహీరాబాద్‌లో ఏర్పాటు చేయాలని పార్టీ ఆలోచించింది. ఈ సభలోనే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించాలని టీపీసీసీ గతంలో నిర్ణయించింది. కానీ, టైమ్ అతి తక్కువగా ఉండటంతో 24న నిర్వహించేందుకు పార్టీ కసరత్తు చేస్తున్నది. ఈ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ కోసం ఏర్పాటు చేసే సభ ఏర్పాట్లు, పర్యవేక్షణ బాధ్యతలను మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్‌తో పాటు ఉమ్మడి వికారాబాద్ జిల్లా నేతలు పరిశీలించనున్నారు. ఆ తర్వాత కొల్లాపూర్, జహీరాబాద్, హైదరాబాద్, సూర్యాపేట్‌లలోనూ సభలు ఏర్పాటు చేయాలని పార్టీ ప్లాన్ చేస్తున్నది. అయితే సభల షెడ్యూల్ అతి త్వరలోనే పార్టీ వెల్లడిస్తుందని టీపీసీసీ పేర్కొన్నది.

Advertisement

Next Story