- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీకి మరో బిగ్ షాక్.. బీఆర్ఎస్‌లో చేరడానికి సిద్ధమైన కీలక నేత?
దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ బీఆర్ఎస్‌లో చేరబోతున్నట్టు సమాచారం. ఇటీవల బీజేపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో చాలామంది లీడర్లు ఆ పార్టీని వీడబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి హస్తం పార్టీలో చేరబోతున్నట్లు వినికిడి. తాజాగా వివేక్ బీఆర్ఎస్‌లో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నట్టు సమాచారం. వివేక్ తొలుత హస్తం పార్టీలోకి వెళ్లాలని భావించారు. వివేక్ తండ్రి, ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంచి స్నేహితులు కావడంతో ఆయన హస్తం పార్టీ వైపు మొగ్గుచూపినట్లు టాక్. ఖర్గేతో వివేక్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఖర్గే స్వాగతించినా తెలంలగాణ హస్తం పార్టీ నేతలు ఇందుకు అంగీరించలేదని సమాచారం. దీంతో ఆయన గులాబీ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
చర్చలు పూర్తి..
బీఆర్ఎస్‌లోకి చేరేందుకు ఇప్పటికే చర్చలు సైతం పూర్తయ్యాయని స్వయంగా గులాబీ నేతలే చెప్పడం గమనార్హం. వివేక్ పార్టీ మారేందుకు ఈటల కూడా ఓ కారణమని తెలుస్తోంది. వారిద్దరికీ ఆర్థిక పరమైన అంశాల్లో విబేధాలు ఉన్నాయి. కాగా తాజాగా ఇప్పుడు ఈటలకు ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు అప్పజెప్పడంతో వివేక్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు టాక్. ప్రస్తుతం వివేక్ కేరళ టూర్‌లో ఉన్నారు. అక్కడి నుంచి రాగానే గులాబీ గూటికి చేరుతారని తెలుస్తోంది. ఆయన ధర్మపురి టికెట్ ఆశిస్తున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ మాత్రం పెద్దపల్లి టికెట్ ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.
మెదక్ జిల్లా కీలక నేత కూడా..
ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బీజేపీ కీలక నేతను సైతం లాగేందుకు బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు వరకైనా సరే ఆ లీడర్‌ను తమ పార్టీలోకి చేర్చుకుని కమలం పార్టీని వీక్ చేయాలని బీఆర్ఎస్ స్కెచ్ వేస్తోంది. టీబీజేపీలో జరిగిన మార్పులు, చేర్పుల కారణంగా పలువురు నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. నిన్న కాక మొన్న పార్టీలో చేరిన నేతలకు ప్రియారిటీ ఇవ్వడంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు. వివేక్, ఏనుగు రవీందర్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారితే మరికొందరు నేతలు సైతం కాషాయ పార్టీని వీడుతారనే ప్రచారం జరుగుతోంది.
Bandi Sanjay Kumar : బండి సంజయ్‌కి గ్రాండ్ వెల్‌కమ్.. ఆ నినాదాలతో దద్దరిల్లిన ఎయిర్‌పోర్ట్!