- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇబ్రహీంపట్నంలో చేదాటిన పరిస్థితి.. లాఠీ ఛార్జ్ చేసి చెదరగొట్టిన పోలీసులు
దిశ, డైనమిక్ బ్యూరో: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం నియోజవర్గ ఎమ్మెల్యే అభ్యర్థు నామినేషన్ వేళ ఘర్షణ చోటు చేసుకుంది. నామినేషనే వేసేందుకు బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డిలు ఒకేసారి ర్యాలీగా బయలుదేరారు. ఈ క్రమంలో అబేంద్కర్ చౌరస్తా వద్ద ఇరు వర్గాలు ర్యాలీలు ఎదురుపడ్డాయి. దీంతో ఇరు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేసుకోగా క్రమంలో వివాదం చెలరేగింది.
దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం జెండా కర్రలు, రాళ్ల విసురుకుని దాడులు చేసుకున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలు, మహిళలతో పాటు పోలీసులకు గాయాలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి వాహనం అద్దాలు ధ్వంసం కావడంతో ఆయన వెంటనే ఆయన వాహనం దిగివెళ్లిపోయారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలపై లాఠా ఛార్జ్ చేసి చెదరగొట్టారు. అనంతరం మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు నామినేషన్ వేసేందుకు ఆర్వో కార్యాలయంలోపలికి వెళ్లారు.
2023 ఎన్నికల ప్రచారంలో తొలి ఘటన:
ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. చాలా సెగ్మెంట్లలో ఈ రెడు పార్టీల మధ్యనే ఓట్ల కోసం నెక్ టు నెక్ ఫైట్ నడవబోతున్నది. ఈక్రమంలో ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకున్న ఘర్షణ హాట్ టాపిక్‌గా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాళ్ల దాడి వరకు వెళ్లి ఉద్రిక్తతగా మారిన తొలి ఘటన ఇదే. దీంతో ఇటువంటి పరిస్థితులు ఇతర చోట్ల తలెత్తకుండా పోలీసులు మరింత కఠిన నిబంధనలు అమలు చేయాలనే టాక్ వినిపిస్తోంది.