తెలంగాణలో ఒక్క రూపాయికే గ్యాస్ సిలిండర్

by GSrikanth |
తెలంగాణలో ఒక్క రూపాయికే గ్యాస్ సిలిండర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఎమ్మెల్యే అభ్యర్థులంతా ప్రచారంపై ఫోకస్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇప్పటికే నియోజకవర్గాల్లో జోరు పెంచారు. కాంగ్రెస్, బీజేపీలు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ నేతలతో తెలంగాణలో ప్రచారం చేయిస్తున్నారు. ఈ క్రమంలో సంచలన హామీలు సైతం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్, రూ.400 లకే ఇస్తామని బీఆర్ఎస్ ప్రకటించాయి. తాజాగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ గ్యాస్ సిలిండర్ హామీలపై సనత్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్థి కుమ్మరి వెంకటేశ్ స్పందించారు. శుక్రవారం ప్రచారంలో భాగంగా ఆయన కూడా సంచలన హామీ ఇచ్చారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు రూ.400, రూ.500 లకే గ్యాస్ సిలిండర్లు ఇస్తే.. నేను ఒక్క రూపాయికే ఏడాదికి నాలుగు సిలిండర్లు ఇస్తానని ప్రకటించారు. వాళ్లకు సాధ్యమైనప్పుడు నాకెందుకు సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వెంకటేశ్ ప్రకటన నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. అదొక్కటే కాదు.. రూపాయికే ఉచిత విద్య, రూపాయికే వైద్యం, రూపాయికే న్యాయ సలహాలు ఇస్తామని చెబుతున్నాడు. ప్రతీ వంద కుటుంబాలకు ఒక వాలంటర్‌ను నియమించి.. 70 ఏళ్ల వయసు దాటిన వారు ఎమర్జెన్సీ పానిక్ బటన్ నొక్కగానే వాలంటీర్లు వచ్చి సాయం అందిస్తారని తెలిపారు.

Advertisement

Next Story