బండి సంజయ్ వ్యక్తి కాదు శక్తి.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |
బండి సంజయ్ వ్యక్తి కాదు శక్తి.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బండి సంజయ్ వ్యక్తి కాదు శక్తి అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం కరీంనగర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో బండి సంజయ్ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో‌కు రాజాసింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఒవైసీకి దమ్ముంటే కరీంనగర్‌లో ఎమ్ఐఎమ్ అభ్యర్థిని పోటీలో పెట్టాలని సవాల్ చేశారు. బండి సంజయ్‌ని తనతో పాటు అసెంబ్లీకి తీసుకెళ్లేందుకే కరీంనగర్‌కు వచ్చానని కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటమిని ముందే గ్రహించిన కరీంనగర్ బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఓటుకు వేలకు వేలు పంచేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. డబ్బులు ముఖ్యమో.. ధర్మం ముఖ్యమో ఆలోచించాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో మైనార్టీ ఓట్లను అమ్మేందుకు ఒవైసీ రెడీ అయ్యారని కీలక ఆరోపణలు చేశారు. అవినీతి ఎమ్మెల్యే, అవినీతి మంత్రి కరీంనగర్‌లో ఉన్నారని వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story