- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేసీఆర్ నా మేనిఫెస్టో కాపీ కొట్టారు.. కేఏ పాల్ హాట్ కామెంట్స్
దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్ అభివృద్ధి చేయలేరని ప్రజలందరికీ తెలిసిపోయిందని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు. ఇవాళ ఆయన సికింద్రాబాద్ బస్తీ పర్యటనలో మీడియాతో మాట్లాడారు. ఎప్పుడైనా సికింద్రాబాద్ బస్తీల్లో తిరిగితే ఇది బంగారు తెలంగాణ కాదని అర్థమవుతుందన్నారు. బస్తీలో కనీస సౌకర్యాలు, డ్రైనేజీలు లేవన్నారు. ఇప్పుడేమో బీఆర్ఎస్ మేనిఫెస్టోలో అది చేస్తాం.. ఇది చేస్తామని చెబుతున్నారన్నారు. అయిన కేసీఆర్ తన నా మేనిఫెస్టో కాపీ కొట్టారని, ఎందుకు కాపీ కొట్టారని ప్రశ్నించారు. బ్రిటిష్ వారి కంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఈ దేశాన్ని సర్వనాశనం చేశాయని విమర్శించారు. ఇందిరాగాంధీ టైమ్ నుంచి ఇప్పటి వరకు లక్షల కోట్ల అప్పుచేసి వేల కోట్లు గాంధీ కుటుంబం సంపాదించిదన్నారు.
కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకోని కనీసం పించన్లు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందన్నారు. మేనిఫెస్టోలో పింఛన్లు, రైతు బంధు పెంచుతామని అంటున్నారు.. మొదటి దానికి మొగుడు లేడు.. కడదానికి కళ్యాణం అనే తీరులో కేసీఆర్ వ్యవహారం ఉందన్నారు. ఉన్న పింఛన్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయ్యిందని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. ఒక్క బీసీని కూడా ముఖ్యమంత్రిగా చేయలేదని మండిపడ్డారు. తాను ముఖ్యమంత్రిని చేస్తే సికింద్రాబాద్ ను స్వర్గంలా, తెలంగాణని రియల్ బంగారు తెలంగాణగా చేస్తానని హామీ ఇచ్చారు. ఎవరైనా వచ్చి ప్రజాశాంతి పార్టీలో చేరాలని, పార్టీ టికెట్ కావాలంటే పదివేల రూపాయలు పెట్టి దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు.