- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విమర్శలు చేసుకున్నా మోడీ, కేసీఆర్ లక్ష్యం ఒక్కటే.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: ఒక పరిశ్రమను ఒప్పించి దేశానికి లేదా రాష్ట్రానికి తీసుకురావడం అంత సులభం కాదని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణకు ఇతర రాష్ట్రాలకు తేడా ఏంటో వివరించి ఒప్పించాల్సి ఉంటుందన్నారు. ఒక మంత్రి కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేయాలంటే మాటలు కాదని అన్నారు. హైదరాబాద్ శివారులోని జీనోమ్ వ్యాలీలో బీఎస్‌వీ కంపెనీ కొత్త యూనిట్‌కు గురువారం భూమిపూజ చేసి మాట్లాడారు. దేశంలోనే అత్యంత మానవ వనరులు కలిగిన రాష్ట్రం తెలంగాణ అన్నారు. భారత్ సీరం సంస్థకు అన్నిరకాల సహకారం అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం జీనోమ్ వ్యాలీలో ఫేజ్-3లో ఉన్నామని.. దీన్ని మరో 250 ఎకరాల్లో విస్తరిస్తామని ప్రకటించారు. అమెరికా అధ్యకుడు జో బైడన్, ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌లకు అదిపెద్ద సవాల్ ఉపాధి కల్పన అన్నారు. ఉద్యోగాల రూపకల్పన సంపద సృష్టించి మళ్లీ అదే ప్రజలకు వినియోగించాలంటే ప్లాన్ ఉండాలన్నారు.
దేశంలో ఎక్కడా లేని అనుకూలతలు తెలంగాణలో ఉన్నాయని, వేగంగా పారిశ్రామికీకరణ, ఉపాధి కల్పనలో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందనడం నిర్వివాదమని పేర్కొన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వానికి పడదని, తెల్లారిలేస్తే మేమూ, వాళ్లూ తిట్టుకుంటాం.. విమర్శలు చేసుకుంటాం.. బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య ఎప్పుడు ఏదో గొడవ నడుస్తూనే ఉంటుంది.. అయినప్పటికీ ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో నంబర్‌వన్ ఎవరని అడిగితే తెలంగాణ అని వాళ్లు కూడా ఒప్పుకునే పరిస్థితిని సీఎం కేసీఆర్ తీసుకొచ్చారన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందన్నారు. దేశ సగటు తలసరి ఆదాయం 1,49,000 ఉండగా.. తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,17,000గా ఉందన్నారు.
సమర్థవంతమైన నాయకత్వం ఉంటే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని తెలంగాణ ప్రభుత్వం నిరూపిస్తోందన్నారు. ప్రపంచానికి వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ మారిందని పేర్కొన్నారు. ప్రపంచంలో తయారయ్యే వ్యాక్సిన్లలో 33 శాతం హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ నుంచే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. ఏడాదికి 900 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతున్నాయని, వచ్చే ఏడాది నుంచి 1400 కోట్ల వ్యాక్సిన్లు ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతాయని అన్నారు. ప్రపంచ వ్యాక్సిన్ల ఉత్పత్తిలో 50 శాతం మనదే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. నిపుణులైన యువకులు ఉండటం, వాళ్లను చూసి కంపెనీలు ఇక్కడికి రావడం, వారికి ప్రభుత్వం సహకరించడమే కారణమని వెల్లడించారు.