- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > Telangana Assembly Election 2023 > జగదీశ్ రెడ్డికి డిపాజిట్ వస్తే పేరు మార్చుకుంటా: కోమటిరెడ్డి
జగదీశ్ రెడ్డికి డిపాజిట్ వస్తే పేరు మార్చుకుంటా: కోమటిరెడ్డి
by GSrikanth |

X
దిశ, వెబ్‌డెస్క్: మంత్రి జగదీశ్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సోమవారం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈసారి సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డికి డిపాజిట్ కూడా రాదు అని విమర్శించారు. ఉమ్మడి జిల్లాలో ఆయన చేసిన అభివృద్ధి శూన్యం అని అన్నారు. సూర్యాపేటలో కాంగ్రెస్ బలంగా ఉందని.. ఎప్పుడూ రెండు వేలు, మూడు వేలు, నాలుగు వేల ఓట్ల మెజార్టీతో గెలిచే జగదీశ్ రెడ్డికి ఈసారి ఓటమి తప్పదని అన్నారు. కేవలం ఓటమే కాదు.. డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమని, డిపాజిట్ నా పేరు మార్చుకుంటాని కీలక వ్యాఖ్యలు చేశారు. నకిరేకల్‌లో వేముల వీరేశం, నల్లగొండలో తాను అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నామని అన్నారు.
Next Story