బీఆర్ఎస్ MLA ఏడుపుపై స్పందించిన ఎంపీ కోమటిరెడ్డి

by GSrikanth |
బీఆర్ఎస్ MLA ఏడుపుపై స్పందించిన ఎంపీ కోమటిరెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నిన్న కంటనీరు పెట్టిన విషయం తెలిసిందే. విపక్షాలు తనను ఒంటి చేయి వాడని, నాతో ఏం కాదని హేళన చేశారని తలుచుకొని మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి సమక్షంలో పబ్లిక్‌ మీటింగ్‌లో కన్నీరు పెట్టి విలపించారు. తాజాగా.. భూపాల్ రెడ్డి కన్నీరు పెట్టిన ఇన్సిడెంట్‌పై కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి స్పందించారు. కళ్లకు జండూబామ్ పెట్టుకొని ఏడవటం నాకు రాదని ఎద్దేవా చేశారు. వచ్చే రోజుల్లో పాపాలు చేసిన అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా ఇంటికి పోవడం ఖాయమని అన్నారు. తాను పేదల ప్రజల సంతోషం గురించే ఆలోచిస్తాను తప్ప నటించడం తనకు రాదని విమర్శించారు. నల్లగొండ నుంచే తాను పోటీ చేస్తానని.. ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించానని తెలిపారు. ఈసారి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

Advertisement

Next Story

Most Viewed