ఐటీ పంజా.. నల్లగొండలో రూ.5 కోట్లు పట్టివేత

by GSrikanth |
ఐటీ పంజా.. నల్లగొండలో రూ.5 కోట్లు పట్టివేత
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి ఐటీ దాడులు కలకలం రేపాయి. ఈ సారి బీఆర్ఎస్ నేతలు టార్గెట్‌గా ఈ దాడులు జరిగాయి. నల్లగొండ, మిర్యాలగూడ, హాలియాలో గురువారం విస్తృతంగా దాడులు జరిపారు. రైస్ మిల్లర్లు, ఎమ్మెల్యేల అనుచరుల ఇళ్లలో సోదాలు జరిపారు. ఈ దాడుల్లో దాదాపు రూ.5 కోట్ల నగదు పట్టుబడినట్లు సమాచారం. ఎన్నికల కోసమే డబ్బు సిద్ధం చేసినట్లు అనుమానిస్తున్నారు. అంతకుమందు మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిపారు. మిర్యాలగూడతో పాటు హైదారాబాద్‌లోని ఆయన నివాసాల్లో ఏక కాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు భారీగా డబ్బు నిల్వచేసినట్లు ఆరోపణలు రావడంతో తనిఖీలు జరిపారు.

Advertisement

Next Story

Most Viewed