- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మునుగోడు అభ్యర్థిని ప్రకటించిన CPM
by GSrikanth |

X
దిశ, వెబ్‌డెస్క్: మరో మూడు స్థానాలకు సీపీఎం అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ముషీరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం జాబితా విడుదల చేశారు. కోదాడ నియోజకవర్గం నుంచి మట్టిపల్లి సైదులు, మునుగోడు నియోజకవర్గం నుంచి నర్సిరెడ్డి, ఇల్లందు నియోజకవర్గం నుంచి దుగ్గి కృష్ణ పేర్లను వీరభద్రం ప్రకటించారు. 14 మందితో తొలి జాబితా, ఇద్దరితో రెండో జాబితా, ముగ్గురితో మూడో జాబితా విడుదల చేసి.. మొత్తం 19 అభ్యర్థులను బరిలోకి దింపింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి పోటీ చేస్తుండగా.. మిర్యాలగూడ నుంచి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పోటీ చేస్తున్నారు.
Next Story