- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సొంత పార్టీ షాకిచ్చేలా రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా దాదాపు ఖరారైంది. ఈ మేరకు స్క్రీనింగ్ కమిటీ రేపు మరోసారి సమావేశం కానుంది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో రేపు, ఎల్లుండి సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశంపై కాంగ్రెస్ ముఖ్య నేత రేణుకా చౌదరి స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సమావేశాల్లో తాను పాల్గొంటానని చెప్పారు. టికెట్ల కేటాయింపులో కమ్మ నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. తమ వద్ద ప్లాన్ ఏ, ప్లాన్ బీ, రెండూ ఉన్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మహిళా కాంగ్రెస్ నేతలు ఇవాళ ఢిల్లీ పెద్దలను కలిశారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు నేతృత్వంలో మహిళా నేతల బృందం ఇవాళ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిసి తమకు 20 టికెట్‌లు ఇవ్వాలని కోరారు.