- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీరు ఇంకా దిగజారుతూనే ఉన్నారు.. ఎమ్మెల్సీ కవితకు కాంగ్రెస్ కౌంటర్
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ రైతు, దళిత వ్యతిరేకి అని ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. ఆ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్సీ కవితకు కౌంటర్ ఇచ్చింది. ‘మీరు ఇంతకన్నా దిగజారరు అనుకున్న ప్రతి సారి.. ఇంకా దిగజారుతూనే ఉంటారు. మాటల్ని వక్రీకరించడంలో.. అసలు సమస్యలను పక్కదారి పట్టించడంలో మీ ‘స్కామిలీ’లో ఎవరూ ఎవరికీ తీసిపోరు.
రైతుల సంక్షేమం కాంక్షించే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. రైతు పెట్టుబడి సాయాన్ని మీ రాజకీయ అవసరాల దృష్ట్యా ఆలస్యం చేయకుండా, రైతుల అవసరం దృష్ట్యా అందజేయాలన్నదే కాంగ్రెస్ ప్రధాన డిమాండ్. మీకు రైతులపై కాస్తయినా చిత్తశుద్ధి ఉంటే మా నాయకులు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డిమాండ్ చేసిన విధంగా, నవంబర్ 2 లోపు రైతులందరికీ పెట్టుబడి సాయం విడుదల చేయండి. ఇకనైనా మీరు ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలను ఆపి, గత పదేండ్లలో రైతులకు ఏం చేశారో చెప్పి ఎన్నికల్లో పోరాడండి.’ అంటూ తీవ్ర విమర్శలు చేస్తూ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది.
కారుకూతల కవిత గారు..
— Telangana Congress (@INCTelangana) October 26, 2023
మీరు ఇంతకన్నా దిగజారరు అనుకున్న ప్రతీ సారి.. ఇంకా దిగజారుతూనే ఉంటారు.
మాటల్ని వక్రీకరించడంలో.. అసలు సమస్యలను పక్కదారి పట్టించడంలో మీ #SCAMILY లో ఎవరూ ఎవరికీ తీసిపోరు.
రైతుల సంక్షేమం కాంక్షించే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ.
రైతు పెట్టుబడి సాయాన్ని మీ… https://t.co/cxDFycx0S0