ఉమ్మడి పాలమూరులో 6 స్థానాలు పెండింగ్.. ఆందోళనలో ఆశావాహులు

by GSrikanth |
ఉమ్మడి పాలమూరులో 6 స్థానాలు పెండింగ్.. ఆందోళనలో ఆశావాహులు
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 55 మంది అభ్యర్థులలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి 8 స్థానాలలో అభ్యర్థులను మొదటి జాబితాలో ప్రకటించారు. ఇందులో నాగర్కర్నూల్ పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్క వనపర్తి మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా.. మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో ఉన్న వీడు అసెంబ్లీ నియోజకవర్గాలలో కేవలం రెండు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. అందరూ ఊహించినట్లుగానే కల్వకుర్తి నుండి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్ కర్నూల్ నుండి కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, అచ్చంపేట డాక్టర్ వంశీకృష్ణ, కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు, అలంపూర్ సంపత్ కుమార్, గద్వాల సరితా తిరుపతయ్య అభ్యర్థిత్వలను ఖరారు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జాబితా విడుదల చేసింది. మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని కొడంగల్ నియోజకవర్గం నుండి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, షాద్నగర్ నుండి ఈర్లపల్లి శంకర్ పేర్లను మాత్రమే ఖరారు చేశారు. మిగిలిన ఐదు నియోజకవర్గాల అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టారు.

అధిష్టానానికి తలనొప్పిగా ఆరు స్థానాల అభ్యర్థుల ఎంపిక:

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఆరు స్థానాల అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి అనిరుద్ రెడ్డి మొదటి నుండీ పోటీ పడుతున్నారు. జడ్చర్లలో పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేసిన అనిరుద్ రెడ్డికి అవకాశం ఇవ్వాలి అని కొంతమంది ముఖ్య నేతలు సూచించడం, ఎర్ర శేఖర్‌ను నారాయణపేట నియోజకవర్గం నుండి పోటీ చేయించాలి అని పార్టీ అధిష్టానం సూచనప్యాయంగా నిర్ణయించి అందుకు అనుగుణంగా అడుగులు వేసింది. ఈ నిర్ణయం వల్ల జరిగే పరిణామాలను బేరీజు వేసుకొని అధిష్టానం పునరాలోచనల్లో పడ్డట్లు తెలుస్తోంది. నారాయణపేట నుండి మాజీ డీసీసీ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డిని రంగంలోకి దించడమా.. మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేకర్‌కు అవకాశం ఇవ్వడమా అన్న అంశంపై సజ్జనభజనలు చేసిన అభ్యర్థి ఎంపిక ఖరారు కాలేదు. మహబూబ్ నియోజకవర్గం నుండి మాజీ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర నియోజకవర్గం నుండి డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి పేర్లు ఖరారు అయినట్లు ప్రచారం జరిగింది కానీ మొదటి జాబితాలో వారి పేర్లను మొదటి జాబితాలో చేర్చలేదు.

వనపర్తిలో మాజీ మంత్రి డాక్టర్ చిన్నారెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి, పెద్దమందడి ఎంపీపీ మెగారెడ్డి ఎవరి స్థాయిలో వారు టికెట్ కోసం ప్రయత్నాలు సాగించడంతో.. అభ్యర్థి ఎంపిక జరగలేదు. యువజన కాంగ్రెస్ కోటాలో తనకు వనపర్తి టికెట్ కావాలి అని శివసేన రెడ్డి పట్టుపడుతుండగా.. తనకు అవకాశం ఇవ్వాలి అని మెగారెడ్డి.. లేదు టికెట్ నాకే ఇవ్వాలి అంటూ డాక్టర్ చిన్నారెడ్డి అధిష్టానం పై ఒత్తిడి తేవడంతో.. ఆస్థానం నుండి అభ్యర్థి ఎంపిక నిలిచిపోయింది. మక్తల్ నియోజకవర్గంలో డిసిసి అధ్యక్షుడు శ్రీహరి, మాజి ఎమ్మేల్యే సీత దయాకర్ రెడీ తనయుడు సిద్ధార్థ రెడ్డి, యువజన నాయకుడు ప్రశాంత్ రెడ్డి, చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డి కూతురు పర్ణిక రెడ్డి టికెట్ కోసం గట్టిగా ప్రయత్నం చేశారు. వీరిలో అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలి.. లేదా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డిని ఈ స్థానం నుండి పోటీ చేయించే ఆలోచన కూడా అధిష్టానం జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా ఈ నియోజకవర్గాలలో అభ్యర్థుల ఎంపిక పూర్తి కాలేదు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed