- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దమ్ముంటే 119 నియోజకవర్గాల్లో రైతులకే టికెట్లు ఇవ్వు.. సీఎం కేసీఆర్కు షర్మిల సవాలు
దిశ, వెబ్ డెస్క్: వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తశుద్ధి ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ తరఫున రైతులకే టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల పేరు చెప్పి కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణను దోచుకున్న సీఎం కేసీఆర్ ఇక మహారాష్ట్రను దోచుకునేందుకు బయలుదేరారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.
‘‘తెలంగాణలో రైతు సమాధులపై దాష్టీక పాలన నడుపుతున్న కేసీఆర్.. ఇప్పుడు మహారాష్ట్ర రైతులను ముంచే పనిలో పడ్డాడు. తెలంగాణలో బుడ్డ దొరలకు, జమీందార్లకు, ఉద్యమద్రోహులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి.. మహారాష్ట్రలో మాత్రం రైతులు అసెంబ్లీకి పోవాలంటూ గప్పాలు కొడుతుండు పెద్ద దొర. మీరు చెప్పే తెలంగాణ మోడల్ అంటే.. తొమ్మిదేండ్లలో 9వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడమా?’’ అని షర్మిల ప్రశ్నించారు.
పంట బీమా, పరిహారం, ఎరువులు, విత్తనాలు ఇస్తామంటూ కేసీఆర్ చెప్పినవన్నీ అబద్దాలేనని అన్నారు. బడాబాబులకు ప్రజా సొమ్మును దోచిపెడుతున్నారని మండిపడ్డారు. రైతులకు కేటాయించిన అసైన్డ్ భూములను కూడా కేసీఆర్ ప్రభుత్వం కెనక్కి లాక్కుంటోందని అన్నారు. వరి వేస్తే ఉరే అని కేసీఆర్ రైతులను భయాందోళనకు గురి చేశారని చెప్పారు. దమ్ముంటే దళిత రైతుకు సీఎం పదవి ఇవ్వాలని సవాలు విసిరారు.
తెలంగాణలో రైతు సమాధులపై దాష్టీక పాలన నడుపుతున్న కేసీఆర్.. ఇప్పుడు మహారాష్ట్ర రైతులను ముంచే పనిలో పడ్డాడు. తెలంగాణలో బుడ్డ దొరలకు, జమీందార్లకు, ఉద్యమద్రోహులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి.. మహారాష్ట్రలో మాత్రం రైతులు అసెంబ్లీకి పోవాలంటూ గప్పాలు కొడుతుండు పెద్ద దొర. మీరు చెప్పే తెలంగాణ…
— YS Sharmila (@realyssharmila) May 20, 2023