ఇన్నాళ్లు బీజేపీకి వంత పాడి ఇప్పుడు విమర్శలా?..YS Sharmilaఫైర్

by Nagaya |   ( Updated:2023-01-12 10:22:39.0  )
ఇన్నాళ్లు బీజేపీకి వంత పాడి ఇప్పుడు విమర్శలా?..YS Sharmilaఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్, బీజేపీ స్వార్థ రాజకీయాలకు తెలంగాణ ప్రజలు బలవుతున్నారని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఇన్నాళ్లు సీఎం కేసీఆర్ బీజేపీకి వంతపాడి తెలంగాణ సంపదను కండ్ల ముందే దోచుకున్నాడని ఇప్పుడు అదే బీజేపీని తిట్టినట్టు చేసి దేశాన్ని కూడా దోచుకుందామని కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. ఎనిమిదేళ్లు గడుస్తున్నా విభజన హామీలపై కేసీఆర్ ఊసెత్తడం లేదని, నీటి వాటాపై మాట్లాడటం లేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని అయినా తన స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి కేసీఆర్ రాష్ట్రాన్ని నిలువునా ముంచాడని ధ్వజమెత్తారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రక్తం చిందించి ప్రజలంతా పోరాడి స్వరాష్ట్రం సాధించుకుంటే రాష్ట్ర నీటి వాటాలపై కనీసం మాట్లాడడం లేదని ఆరోపించారు. కేసీఆర్ చేసింది దొంగ దీక్ష కాబట్టే నోరు విప్పడం లేదా అని ప్రశ్నించారు. ప్రజల పోరాటాన్ని ఆసరాగా చేసుకుని ముఖ్యమంత్రి పీఠం ఎక్కి రాష్ట్రాన్ని అడుగడుగునా కొల్లగొట్టడం, తెలంగాణ తల్లికి ద్రోహం చేయడమే మీ దొంగ దీక్ష లక్ష్యమా అని నిలదీశారు. బీఆర్ఎస్, బీజేపీ స్వార్థ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డ ఆమె బీజేపీ, ముక్త్ భారత్, బీఆర్ఎస్ ముక్త్ భారత్ కావాలని ఆకాంక్షించారు.

Also Read....

బీజేపీ సర్కార్‌ను తాలిబన్లతో పోల్చిన సీఎం KCR

Advertisement

Next Story

Most Viewed