- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రూపు-4 పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాయని యువతి ఆత్మహత్య
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజధానిలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీన్ కమిషన్ నిర్వహించిన గ్రూపు-4 పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాయని హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శిరీష అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. జవహర్ నగర్‌లోని హాస్టల్‌లో ఉంటూ ఇన్నాళ్లు ప్రిపేర్ అయిన యువతి.. శుక్రవార రాత్రి అదే హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. తోటి స్టూడెంట్స్ సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చారు.
కేసు నమోదు చేసుకున్నారు. శిరీష స్వస్థలం మహబూబాబాద్ జిల్లా ముప్పారం గ్రామానికి చెందినదిగా గుర్తించారు. ప్రస్తుతం పోస్టుమార్టం నిమిత్తం యువతి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా, గ్రూపు-4 సర్వీసులో భాగంగా 8,180 పోస్టుల భర్తీకి గతేడాది టీఎస్‌పీఎస్‌సీ రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 10వ తేదీన పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. యువతిపై ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.