ఆకేరు చెరువులో జాలరుల వలకు చిక్కిన వింత చేపలు.. చూస్తే షాక్ అవుతారు..

by Indraja |
ఆకేరు చెరువులో జాలరుల వలకు చిక్కిన వింత చేపలు.. చూస్తే షాక్ అవుతారు..
X

దిశ వెబ్ డెస్క్: ఆదివారం వస్తే చాలు చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. మాంసాహారం తప్పని సరిగా ఉండాలి. కాగా చికెన్, మటన్‌తోపాటు చాపలకు సైతం మంచి ప్రాధాన్యత ఉంది. దీనితో చాలామంది మత్స్యకారులు చాపల వ్యాపారంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని మత్స్యకారులను వింత చేపలు పరేషాన్ చేస్తున్నాయి. చేపల కోసం వల వేసిన జాలర్లు మంచిమంచి చేపలు పడినట్టు ఉన్నాయని సంబరపడి వల తీయడం, తీరా చూస్తే అందులో వింత చేపలు దర్శనం ఇవ్వడం మనం తరుచూ ఎదో ఒక చోట చూస్తూనే ఉన్నాం.

తాజాగా మరోసారి జాలర్ల వలలో వింత చేపలు దర్శనమిచ్చాయి. వాటి రూపురేఖలు చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తోందని స్థానికులు అంటున్నారు. ఈ సముద్రంలో ఉండాల్సిన దెయ్యం చేపలు చెరువులో దర్శనం ఇవ్వడంతో మత్స్యకారులు ఆంధోళన చెందుతున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం బీచురాజుపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బాలాజీ తండాకు చెందిన జాలరులు బీచురాజుపల్లి లోని ఆకేరు లో చేపలు పట్టేందుకు వెళ్లారు.

ఈ నేపథ్యంలో చెరువులోకి వల విసిరిన జాలర్లు కొంత సమయం తరువాత వల తీసి చూడగా.. అందులో చిక్కిన చాపలను చూసి షాక్ అయ్యారు. దాదాపు కేజీ బరువున్న చేపలు వలకు చిక్కాయి. అయితే ఆ చేపలు చూడడానికే చాలా భయంకరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జాలర్లు మాట్లాడుతూ.. వాటిని స్థానికంగా దెయ్యం చేపలు అని పిలుస్తారని తెలిపారు. సాధారణంగా ఆ చేపలు సముద్రంలో ఉంటాయని, భహుశా వరదలకు ఆ చేపలు సముద్రం నుండి చెక్‌డ్యామ్‌లోకి వచ్చి ఉంటాయని అన్నారు. అయితే ఆ చాపలు వాటి చుట్టూ ఉండే వేరే స్థానిక చేపలను గాయపరిచి, తినేస్తాయని.. దీనితో చేపల అభివృద్ధికి ఆటకం ఏర్పడుతుందని ఆంధోళన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed