కార్పొరేట్ స్కూళ్లకే వెళ్లక్కర్లేదు.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్

by Ramesh N |
కార్పొరేట్ స్కూళ్లకే వెళ్లక్కర్లేదు.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సమగ్ర శిక్ష, పాఠశాల విద్యాశాఖ తెలంగాణ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం సోమవారం రవీంద్రభారతిలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ పోస్ట్ చేశారు.

‘మట్టిలో మాణిక్యాలు మన విద్యా కుసుమాలు, లక్ష్య సాధనకు లక్షల రూపాయల ఫీజులు కట్టి కార్పొరేట్ స్కూళ్లకే వెళ్లక్కర్లేదు, సర్కారు బడిలో చదివి కూడా సత్తా చాటగలమని నిరూపించిన విద్యార్థులకు నా అభినందనలు, వారి భవిత ఉజ్వలంగా ఉండాలని, ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’ అని పేర్కొన్నారు.

Advertisement

Next Story