- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొన్న బీఎల్.. నేడు బండి.. కీలక నేతలే బీఆర్ఎస్ టార్గెట్
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బీఎల్ సంతోష్‌ను టార్గెట్ చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌ను కార్నర్ చేసింది. మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసులో బీఎల్ సంతోష్‌ను నిందితుడిగా పేర్కొని విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీచేస్తే ఇప్పుడు టెన్త్ పరీక్షల పేపర్ లీక్ కేసులో బండి సంజయ్‌ను ఏ-1గా చేర్చింది.
బీఎల్ సంతోష్ విషయంలో బీఆర్ఎస్ సక్సెస్ కాలేకపోయినా బండి సంజయ్ విషయంలో మాత్రం అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపి ఆ పార్టీకి సవాల్ విసిరినట్లయింది. రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదగడాన్ని జీర్ణించుకోలేకనే అరెస్టుల పర్వానికి బీఆర్ఎస్ సర్కారు తెర లేపిందని కాషాయ నేతల్లో చర్చ జరుగుతున్నది. ఈ రెండు పార్టీలే ప్రధాన రాజకీయ ప్రత్యర్థులనే మెసేజ్ తెలంగాణ ప్రజల్లోకి వెళ్ళినట్లయింది.
పోలీసులదే పైచేయి
కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ బీఆర్ఎస్, బీజేపీ పథకం ప్రకారం వ్యవహరిస్తున్నాయని, ఈ రెండింటి మధ్య మాత్రమే ఎలక్షన్ పోటీ ఉంటుందని చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇప్పుడు బండి సంజయ్ అరెస్టు సైతం అలాంటి వ్యూహంలో భాగమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీని అప్రాధాన్యం చేయడానికి జరుగుతున్న కుట్రలో భాగమే ఈ రెండు పార్టీల మధ్య ఇటీవల జరుగుతున్న పరిణామాలనే వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. బీఎల్ సంతోష్ విషయంలో లీగల్‌గా తెలంగాణ పోలీసులకు షాక్ ఇచ్చినా బండి సంజయ్ విషయంలో మాత్రం పోలీసులదే పైచేయి అయిందనే టాక్ వినిపిస్తున్నది. సంజయ్‌కు హన్మకొండ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో సంతోషం వ్యక్తమవుతున్నది.
రెండు పార్టీల మధ్య ఘర్షణ
టచ్ చేయకూడని వ్యక్తిని తెలంగాణ పోలీసులు టచ్ చేశారని పరోక్షంగా బీఎల్ సంతోష్ చేసిన కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి. రానున్న కాలంలో బీజేపీ ఎలా వ్యవహరిస్తుందనే చర్చకు తెరలేపారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈ రెండు పార్టీల మధ్య ఘర్షణ సరికొత్త దశకు చేరుకోవడం గమనార్హం. రెండు పార్టీల మధ్య రాజకీయ ఘర్షణ చివరకు కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు, పోలీసు వ్యవస్థల మధ్య ఫైట్‌గా మారింది.
Read more: