- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Yadagirigutta : యాదగిరిగుట్టలో కార్తీక శోభ..జోరుగా సత్యనారాయణ స్వామి వ్రతాలు
దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం కార్తీక మాసం(Kartika month) పురస్కరించుకుని భక్తుల రద్ధీతో కిటకిటలాడింది. కార్తీక మాసం తొలి రోజు శనివారం సత్యనారాయణ వ్రతాలు(Satyanarayana swami vratalu) నిర్వహించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. వ్రత మండపం భక్తులతో కిక్కిరిసింది. వ్రతాల అనంతరం ప్రధానాలయంలో స్వామివారిని దర్శి్ంచుకునేందుకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. కార్తీక మాసంలో అధికంగా నిర్వహించే సత్యనారాయణ వ్రతాల నిర్వాహణకు దేవస్థానం అదనపు ఏర్పాట్లు చేసింది.
శివకేశవుల ఆరాధన మాసమైన కార్తీక మాసంలో శైవ, వైష్ణవ ఆలయాలకు భక్తుల సందడి పెరిగింది. ముఖ్యంగా నదీ స్నానాలు ఆచరించి కార్తీక దీపారాధన చేయాలనుకునే వారు గోదావరి, కృష్ణ, తుంగభద్ర, మూసీ, మంజీరా, ప్రాణహిత నది తీరాల వెంట ఉన్న పుణ్య క్షేత్రాలను సందర్శించనున్నారు. భద్రాచలం, కాళేశ్వరం(సంగమ స్థలి), కొవ్వురూ గోష్పాద క్షేత్రం, ధర్మపురి, బాసర, మఠంపల్లి, వాడపల్లి(సంగమ స్థలి), పానగల్, జోగులాంబ ఆలయాలకు కార్తీక మాసం భక్తుల సందడి కనిపిస్తోంది.
నవంబరు 2వ తేదీ నుంచి ప్రారంభమైన కార్తీక మాసంలో ప్రత్యేక దినాలుగా 3వ తేదీ ఆదివారం యమ విదియ భగినీహస్త భోజనం(అన్నాచెల్లెళ్ల పండగ)ను జరుపుకుంటారు. 4వ తేదన మొదటి కార్తీక సోమవారం, 5వ తేదీ మంగళవారం నాగుల చవితి, 11వ తేదీన రెండవ కార్తీక సోమవారం, 12వ తేదీన దేవుత్తని ఏకాదశి, 13వ తేదీన క్షీరాబ్ది ద్వాదశి, 15వ తేదీన కార్తీక పౌర్ణమి పర్వదినాలుగా ఉన్నాయి. అలాగే 18వ తేదీ కార్తీకమాసం మూడో సోమవారం, 25వ తేదీ నాలుగో సోమవారం, 26వ తేదీన కార్తీక బహుళ ఏకాదశి, 29వ తేదీ కార్తీక మాసం మాస శివరాత్రి, డిసెంబర్ 1వ తేదీన కార్తీక అమావాస్య, 2వ తేదీన మార్గశిర శుధ్ధ పాడ్యమి పోలి స్వర్గం పర్విదినాలుగా జరుపుకుంటారు.