Yadagirigutta : యాదగిరిగుట్టలో అయ్యప్ప స్వాముల సామూహిక గిరి ప్రదక్షిణ

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-11 04:52:42.0  )
Yadagirigutta : యాదగిరిగుట్టలో అయ్యప్ప స్వాముల సామూహిక గిరి ప్రదక్షిణ
X

దిశ, వెబ్ డెస్క్ : యాదగిరిగుట్ట(Yadagirigutta)శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం(Sri Lakshmi Narasimha Swamy Temple) అయ్యప్ప దీక్ష మాలధారుల(Ayyappa Maladhars) కు ప్రత్యేకంగా సామూహిక గిరిప్రదక్షిణ(mass circumambulation), ఉచిత ప్రత్యేక దర్శనాలు కల్పించింది. బుధవారం నిర్వహించిన గిరి ప్రదక్షిణలో వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన వేలాది అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు. నమో నారసింహ, గోవింద నామస్మరణలతో, అయ్యప్ప శరణు ఘోషతో యాదగిరులు మారుమ్రోగాయి.

గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని స్థానిక ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య యాదవ్, ఈవో భాస్కర్ రావులు ప్రారంభించారు. గిరి ప్రదక్షిణ అనంతరం అయ్యప్ప భక్తులకు ఉదయం 7గంటల నుంచి 8:45గంటల మధ్య ఉచిత ప్రత్యేక దర్శనం కల్పించడంతో పాటు స్వామివారి ప్రసాదాన్ని అందించారు.

Advertisement

Next Story

Most Viewed