Venkatesh: ‘పుష్ప 2’ సినిమా చూసిన వెంకీ మామ.. అల్లు అర్జున్, శ్రీవల్లి గురించి ఏమన్నారంటే?(పోస్ట్)

by Kavitha |
Venkatesh: ‘పుష్ప 2’ సినిమా చూసిన వెంకీ మామ.. అల్లు అర్జున్, శ్రీవల్లి గురించి ఏమన్నారంటే?(పోస్ట్)
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) కాంబోలో తెరకెక్కిన తాజా మూవీ ‘పుష్ప 2’. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించింది. అయితే ‘పుష్ప 2’(Pushpa 2) మూవీ డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రం ప్రస్తుతం కలెక్షన్స్ పరంగా సంచలనం సృష్టిస్తూ, కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే రూ. 1002 కోట్లు కలెక్ట్ చేసింది.

ఇక ఈ విషయాన్ని మూవీ మేకర్స్ అధికారికంగా వెల్లడిస్తూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే పుష్ప కలెక్షన్ల జోరు చూస్తే ఈజీగా రూ.1500 కోట్ల కలెక్షన్స్ వస్తాయంటూ సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ‘పుష్ప 2’ సినిమాని ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు చూసి.. అల్లు అర్జున్, రష్మిక మందన్న, డైరెక్టర్ సుకుమార్ అలాగే ఎంటైర్ టీమ్‌పై ప్రశంసలు కురిపించారు. అయితే తాజాగా విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అలియాస్ వెంకీ మామ కూడా పుష్ప మూవీని వీక్షించాడు. అనంతరం సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నాడు.

పోస్ట్‌లో భాగంగా.. ‘అల్లు అర్జున్ అద్భుతంగా నటించారు. ఆయన నటన చూసి కళ్లు పక్కకు కూడా తిప్పలేకపోయా. దేశ వ్యాప్తంగా ఈ మూవీ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. అలాగే ఈ సినిమాలో రష్మిక అసాధారణ ప్రదర్శన చేసింది. గొప్ప విజయం అందుకున్న డైరెక్టర్ సుకుమార్, దేవీశ్రీ ప్రసాద్‌(Devisri Prasad)తో పాటు చిత్ర బృందానికి అభినందనలు’ అని ప్రశంసలు కురిపించారు. ఇక చివర్లో పుష్ప ట్రేడ్ మార్క్ డైలాగ్ ‘అస్సలు తగ్గేదేలే’(Assalu Thaggedele) అని క్రేజీ క్యాప్షన్‌ని జోడించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంకీ పోస్ట్ పై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.




Next Story