- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్రమ నిర్మాణాలపై నోటీసుల అస్త్రం!
దిశ, ఆర్మూర్: జిల్లాలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో యథేచ్ఛగా జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికార గణం నోటీసుల అస్త్రం సాధిస్తున్నట్లు ఆర్మూర్ లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. సదరు అక్రమ నిర్మాణ దారులకు మున్సిపల్ అధికారులు నోటీసులను జారీ చేస్తూ మున్సిపల్ ద్వితీయ శ్రేణి అధికారులు, సిబ్బందితో ఆ నిర్మాణ పనులను పకడ్బందీగా నిలిపి వేయిస్తున్నట్లు తెలిసింది. కానీ సదరు అక్రమ నిర్మాణదారులతో మున్సిపల్ అధికారగణం కార్యాలయానికి పిలిపించుకుని మళ్లీ పంపించడం శర మామూలుగానే జరుగుతుంది. అనుమతులు లేని ఎలాంటి అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇచ్చినంత మాత్రాన అనుమతులు రావు అన్నది జగమెరిగిన బహిరంగ రహస్యమే. సదరు నోటీసు అందుకున్న వ్యక్తులు మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన తర్వాత ఏ విధంగా సక్రమ నిర్మాణాలు చేస్తున్నట్లు లెక్కగడుతున్నట్లు అర్థం కాని పరిస్థితి. ఆర్మూర్ ప్రజలు లోతుగా ఆలోచించిన అర్థం కావడం లేదని చర్చించుకుంటున్నారు. సాధారణంగా ఒక వ్యక్తి ఏదైనా నిర్మాణానికి అనుమతులు తీసుకుందాం అనుకొని అంతకంటే ముందుగా పనులు ప్రారంభిస్తే అలా చేయకూడదని చేసిన దాన్ని నేలమట్టం చేసి సాధారణ ఖాళీ ప్లాటుగా పర్మిషన్ కు అప్లై చేసుకుంటేనే అనుమతులు వస్తాయని అధికారులు చెబుతుండడం అందరికీ తెలిసిందే.
కానీ ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయానికి అక్రమ నిర్మాణాలు చేస్తున్న నోటీసులు అందుకున్న వ్యక్తులు మున్సిపల్ కార్యాలయానికి వచ్చి కలిస్తే అది సక్రమ నిర్మాణాలు ఏ విధంగా అవుతున్నాయో నోటీసులు అందుకున్న వారికి ఏం జరుగుతుందో తెలియదు. కానీ వారి నిర్మాణాలు శరా మామూలుగా జరుగుతుండడం పట్ల ఆర్మూర్ లో విస్తృతంగా జనం చర్చించుకుంటున్నారు. అక్రమ నిర్మాణాలకు అడ్డూ, అదుపు లేకుండా పోతోంది. ఓ వైపు మున్సిపల్ అధి కారులు అక్రమ కట్టడాలపై కొరఢా ఝళిపిస్తుండగా, మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తుండటం గమనార్హం. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై పలు వార్డులలో ప్రజలు ఫిర్యాదులు చేసిన ఎల్ఆర్ఎస్ బిజీలో ఉన్నానని టౌన్ ప్లానింగ్ అధికారులు సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
ఎల్ఆర్ఎస్ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత చూద్దాం అంటూ అధికారులు సమాధానాలు ఇవ్వడాన్ని బట్టి చూస్తే వారి పనితీరుపై ఆశ్చర్యం కలుగుతుంది. ఆర్మూర్ మున్సిపల్ లెక్కకు మించి అక్రమ నిర్మాణాలు జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై పలు పత్రికల్లో కథనాలతో వార్తలు వచ్చిన మున్సిపల్ లోని అధికారులు పట్టించుకోకుండా.. మున్సిపల్ లో జరుగుతున్న అక్రమ పనులను గుర్తించి వారే ప్రత్యేకంగా నోటీసులు ఇస్తూ వారిని మున్సిపల్‌కు పిలిపించు కుంటూ బేర సారాలు చేస్తూ మామూళ్ల మత్తులో జరుగుతున్నారంటూ ఆర్మూర్ మున్సిపల్ లోని ప్రజలు చర్చించుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారంతో తెలిసింది.
గతంలో జారీ చేసిన ఎన్‌ఫోర్స్ బెడ్ నోటీసులు ఎక్కడి వరకు వచ్చాయో..
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో కోకొల్లలుగా లెక్కకు మించి అక్రమ నిర్మాణాలు జరుగుతున్న గతంలో ఏదో తూతూ మంత్రంగా పనిచేస్తున్నామన్నట్టు ఆరు భవన నిర్మాణ దారులకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. సుమారు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు నోటీసులు జారీచేసిన 8 నెలలు కావస్తున్నా 6 భవన నిర్మాణదారుల్లోంచి ఇప్పటివరకు కేవలం 4 నిర్మాణదారులకు మాత్రమే పెనాల్టీలను విధించినట్లు తెలిసింది. ఏ భవనానికి ఎంత పెనాల్టీ విధించారు. ఆ భవనంలో ఏమేం తప్పులున్నావి అనే విషయం మాత్రం ఇంతవరకు మున్సిపల్ అధికారులు గానీ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి గాని ప్రకటించిన దాఖలాలు లేవు. పైగా ఇంకా ఇప్పటివరకు రెండు భవనాలకు మాత్రం ఇంతవరకు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు జరిమానాలను విధించకుండా చూసీచూడనట్లు సాకులు చెబుతూ పక్కకు పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. అంతకుమించి గమ్మత్తైన విషయం ఏమిటంటే ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు విధించిన జరిమాణాలు కూడా ఖచ్చితమైనవి కావంటూ మున్సిపల్ అధికారులు బాహాటంగా మాట్లాడటం గమనార్హం. మరి ఈ అక్రమ నిర్మాణదారులు అంత భారీ స్థాయిలో జరిమానాలు ఎందుకు కడుతున్నట్లు.. వారికి ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఎందుకు విధిస్తున్నట్లు ఎవరికి అంతుచిక్కని ప్రశ్నలా మిగిలిపోయింది.
అందిన కాడికి దండుకోవడమేనా?
మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అందిన కాడికి దండుకో అన్నట్టు కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు రియలాటర్లకు, అక్రమ నిర్మాణ దారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తూ రూ.లక్షలు దండు కుంటున్నట్లు ఆర్మూర్ లో జనం చర్చించుకుంటున్నారు. అసైన్డ్, ప్రభుత్వ 10 శాతం స్థలాలకు సంబంధిత అధికారులతో కలిసి ఇంటి నెంబర్లను కేటాయించడంతో పాటు, పలు వార్డులలో ఇండ్ల కూల్చివేతల జారీలో అక్రమాలు జరిగినట్లు జోరుగా చర్చ జరుగుతుంది. అక్రమ నిర్మాణదారులు చేసే అక్రమ షెడ్డులకు, నిర్మాణాలకు అండగా ఉంటూ దండిగా సొమ్ము చేసుకుంటున్నారు. ఆర్మూర్ లో కొద్ది నెలల కింద గత ప్రభుత్వ హయాంలో ఒక వెలుగు వెలిగిన ఆ నాయకుడు పెర్కిట్‌లో నిర్మిస్తున్న ఓ భారీ భవనంలో ప్రజా ప్రతినిధులు రూ.25 లక్షల వరకు, అధికారులు రూ.10 లక్షల వరకు వసూలు చేసి దండుకున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆర్మూర్ లో జరుగుతున్న ఈ అక్రమ తంతు గురించి తెలిసి కాంగ్రెస్ రాష్ట్ర కార్పొరేషన్ లో ఓ పదవి పొందిన ఓ రాష్ట్ర నాయకుడు ఇటీవల ఇందూరు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి ఆర్మూరులో జరుగుతున్న తంతును వెలికి తీయాలని కోరిన విషయం తెలిసింది. మరి ముందు రోజుల్లో ఆర్మూర్ మున్సిపల్ లో ఏం జరగనుందోనని, జరగబోతుందోనని ఆర్మూర్ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నోటీసులు జారీ చేసి ఎన్ ఫోర్స్ మెంట్‌కు నివేదిస్తున్నాం
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణ దారులకు నోటీసులు జారీ చేసిన వారిపై చర్యలకు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు నివేదిస్తున్నాం. గతంలో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు జారీచేసిన 6 అక్రమ నిర్మాణదారుల్లో నలుగురికి జరిమానాలు విధించాం. త్వరలోనే మిగతా ఇద్దరికీ కూడా లెక్కలు తీసి విధిస్తాం. ఆర్మూర్ మున్సిపల్ లో కమిషనర్ గా నేను బాధ్యతలు చేపట్టక ముందు జరిగిన అక్రమ నిర్మాణాలపై, ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాలపై ప్రత్యేకంగా ఓ టీం వేసి విచారణ చేయిస్తున్నా. త్వరలోనే పూర్తిస్థాయిలో నోటీసులు జారీచేసిన అక్రమ నిర్మాణదారుల చిట్టా తయారు చేసి చర్యల కోసం ఎన్ ఫోర్స్ మెంట్‌కు నివేదిక అందజేస్తా.:- రాజు, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్
నిర్వహణ లేక వెలవెలబోతున్న క్రీడా ప్రాంగణాలు
పిచ్చి మొక్కలతో నిండిన మైదానాలు మందుబాబులకు అడ్డాగా మారిన వైనం నిరాశలో క్రీడాకారులు ప్రతి గ్రామంలో పిల్లలకు చదువుతోపాటు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించడానికి, యువత తాము ఎంచుకున్న క్రీడల్లో నైపుణ్యం పొందడానికి గత ప్రభుత్వం తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. అప్పటివరకు గ్రామాల్లో క్రీడా మైదానాలు లేక ప్రైవేటు స్థలాలు, ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న స్థలాల్లో ఆడుకునే యువతీ యువకులు క్రీడా ప్రాంగణాల్లో ఆడుకోవచ్చని సంబురపడ్డారు. క్రీడా ప్రాంగణాల బోర్డులు చూసి త్వరలో క్రీడా పరికరాలు, సామగ్రి వస్తాయని ఆశించారు. కానీ, క్రీడా ప్రాంగణాల్లో పరికరాల ఊసేలేదు. కేవలం క్రీడా ప్రాంగణాల పేరిట బోర్డులు మాత్రమే దర్శనమిస్తున్నాయి. యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారిలోని క్రీడా నైపుణ్యలను వెలికి తీయాలనే ప్రభుత్వ లక్ష్యం ఉన్నతంగా ఉన్నా క్షేత్రస్థాయిలో అధికారులు, నాటి ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోయింది. దీంతో లక్షలు వెచ్చించి నెలకొల్పిన క్రీడా ప్రాంగణాలు అలంకార ప్రాయంగానే మిగిలిపోయాయని, కొత్త సర్కారైనా పట్టించుకుని సౌకర్యాలు కల్పించడం ద్వారా అందుబాటులోకి తీసుకురావాలని క్రీడాకారులు కోరుతున్నారు.