వావ్.. టాలెంట్ ఎవరి సొత్తు కాదని నిరూపించిన పెద్దాయన! (వీడియో)

by Sathputhe Rajesh |   ( Updated:2023-12-15 16:43:00.0  )
వావ్.. టాలెంట్ ఎవరి సొత్తు కాదని నిరూపించిన పెద్దాయన! (వీడియో)
X

దిశ, దుబ్బాక : టాలెంట్ ఎవరిసొత్తూ కాదు.. అద్భుతమైన టాలెంట్ ఉండి ఆత్మవిశ్వాసం మనసులో ఉంటే ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా అనుకున్నది సాధించడం మాత్రం ఖాయం.. అవును ఇటీవలి కాలంలో ఇది ఎంతో మంది ఇది నిరూపిస్తున్నారు. ఎన్నో కష్టాలను ఎదుర్కున్నవారు సైతం ప్రతిభను చాటి ఊహించని రేంజిలో క్రేజ్ సంపాదిస్తున్నారు.దుబ్బాక మండలానికి చెందిన హబ్షీపూర్ గ్రామంలో రూ,16 వేల‌ ఖర్చుతో ఎలక్ట్రానిక్ సైకిల్ లు తయారీ చేసి గ్రామ ప్రజలతో శబాష్ అనిపించుకున్నాడు. ఈ ఎలక్ట్రానిక్ సైకిల్‌కి ఎలాంటి పెట్రోల్, డీజిల్, అయిల్ లాంటివి లేకుండానే బైక్‌తో సమానంగా వెళ్లొచ్చు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్షీపూర్ గ్రామానికి చెందిన పబ్బ చంద్రం ( 60 ) ఇతనికి (2) కుమార్తెలు,(4) కుమారులు ఉన్నారు.

మీరు పిల్లలకి అందరికీ వివాహాలు జరిపి తాను ఎవరిపై ఆధారపడకుండా ఉండడానికి చిరు వ్యాపారులు చేస్తు గ్రామాల్లోకి వెళ్లి వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ వయసులో తన సొంత టాలెంట్‌తో ఎలక్ట్రానిక్ సైకిల్ ను తయరు చేయడం లక్ష్యంగా పెట్టుకొని ప్రయత్నం సాగించాడు. ప్రయత్నం చేస్తే సాధించండి ఏదీ లేదన్నట్టుగా ప్రయత్నం మొదలుపెట్టాడు. కేవలం రూ,16 వేలతో ఎలక్ట్రానిక్ సైకిళ్ళు తయారు చేశారు. వినూత్న రీతిలో నూతనంగా ఎలక్ట్రానిక్ సైకిల్‌ను తయారు చేసి తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ ఎలక్ట్రానిక్ సైకిల్ ఎలక్ట్రానిక్ బైక్ వలే నడుస్తుంది. దీనికి సుమారు రూ.16 వేల వరకు ఖర్చయిందని తెలిపారు. టాలెంట్ ఉన్న వాళ్ళని గుర్తించాలని ఇతనికి ఆర్థికంగా సహకరిస్తే ఇంకా మరిన్ని తయారు చేయగలడని స్థానికులు అంటున్నారు. టాలెంట్‌ కు చదువుతో పని లేదని పట్టుదలతో దేనినైనా సాధించవచ్చన్నారు.


Advertisement

Next Story

Most Viewed