- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీర్లు దొరక్క మద్యం ప్రియులు బేజారు.. సీసీ టీవీల్లో రికార్డయిన వైన్ షాప్ నిర్వాహకుల నిర్వాకం
దిశ, అడ్డాకుల: ఈ వేసవిలో ఎండలు ఏ లెవెల్‌లో మండుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంటి కాలు బయట పెట్టే పరిస్థితి లేదంటేనే ఎలా మండుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఉక్కపోతకు ఇంట్లో ఉండలేక బయటకు వెళ్లలేక ప్రజలు నానా అవస్థలు పెడుతున్నారడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఈ ఎండకు మందుబాబులు బీర్ తాగాలనుకోవడం సహజం. చల్లగా ఓ బీర్ తాగితే హాయిగా ఫీలవుతారు. అయితే, ఈ వేసవి మొదటి నుంచి రాష్ట్రంలో బీర్లు కరువు ఏర్పడింది. వైన్ షాపుల్లో బీర్లు లేక మందుబాబులు బేజారవుతున్నారు. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలో రెండు వైన్ షాపులు ఉన్నాయి. అయితే ఈ రెండు వైన్ షాపుల్లోనూ బీర్ల కొరత ఏర్పడింది.
అసలే బీర్లు దొరక్క మద్యం ప్రియులు కంగారు పడుతుంటే మండల కేంద్రంలోని లక్ష్మీనరసింహ వైన్స్, దుర్గా వైన్స్ షాపులలో బీర్ల స్టాక్ రాగానే బెల్ట్ షాప్ వాహనాల్లోకి ఎక్కించి తరలిస్తున్నారు. ఈ తతంగమంతా వైన్ షాపులో ఉన్న సీసీ కెమెరాలు రికార్డు అయింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు మద్యం షాపు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్టాక్ రాగానే బెల్టు షాపులకు తరలించి రూ.10 నుంచి రూ.15 వరకు అధికంగా విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం. సరుకు మొత్తం బెల్టు షాపులకే సరఫరా చేయడంతో పాటు రాత్రి 7 గంటలకే మద్యం దుకాణాలు బంద్ చేసి వెళుతున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు రెండు వైన్ షాపులపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Read More...
BREAKING: మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం.. కోళ్ల ఫారం గోడ కూలి ఇద్దరు కార్మికులు దుర్మరణం