- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Eravarthi: ఫేక్ వార్తలు ఎందుకు కేటీఆర్..? ఈరవత్రి అనిల్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రజల సొమ్ముతో దేశమంతా ప్రకటనలు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీనే అని తెలంగాణ ఖనిజాభివృద్ది సంస్థ చైర్మన్(Telangana Mineral Development Corporation Chairman) ఈరవత్రి అనిల్(Eravatri Anil) అన్నారు. కేటీఆర్(KTRBRS) వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. సంచలన ఆరోపణలు(Sensational Allegations) చేశారు. ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్ర పత్రిక(Maharastra Paper)లో యాడ్(Congress Ad) వచ్చిన మాట వాస్తవమేనని కానీ అది కాంగ్రెస్ పార్టీ ప్రచురణకు ఇచ్చిన యాడ్ అని, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది కాదని స్పష్టం చేశారు. ఇక్కడ చెయ్యి గుర్తు కూడా ఉంది గమణించాలని, కాంగ్రెస్ యాడ్ ఏదో..? ప్రభుత్వ ప్రకటన ఏదో తెలియదా..? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
దీనిని ప్రస్తావిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటనల కోసం బడ్జెట్ లో 300 కోట్లు కేటాయించి, మహారాష్ట్రలో యాడ్ ఇచ్చిందని చెప్పడం సిగ్గుచేటని, ఇలాంటి ఫేక్ వార్తలు ఎందుకని మండిపడ్డారు. అంతేగాక గత ప్రభుత్వం(BRS Govt) వందల కోట్ల రూపాయల(Hundredes Of Crores) ప్రజల సొమ్ము(Pepole's Money)తో ప్రకటనలు ఇచ్చిందని చెబుతూ.. వాటికి సంబంధించిన ఆధారాలను మీడియా ముందు చూపించారు. ఒక్క మహారాష్ట్రలోనే కాదు దేశమంతా వివిధ బాషలలో ప్రభుత్వ సొమ్ముతో యాడ్ లు ఇచ్చారని, మళ్లీ తిరిగి దొంగలే పోలీసులను దొంగ దొంగ అన్నట్లుందని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో పార్టీ కార్యక్రమాలు జరిపి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసింది వాస్తవం కాదా అని బీఆర్ఎస్ నాయకులను ఈరవర్తి అనిల్ నిలదీశారు.