- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నాకు భయమెందుకు నేనేం తప్పు చేయలేదు.. : కవిత
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీని ప్రశ్నిస్తున్న విపక్షాలపై దర్యాప్తు సంస్థలు దాడు చేస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహిళా రిజర్వేషన్లపై గత ప్రభుత్వాలు మాట నిలబెట్టుకోలేదన్నారు. ఢిల్లీలో కవిత మీడియాతో మాట్లాడారు. 27 ఏళ్లుగా మహిళా బిల్లు కోసం చర్చ జరుగుతోందన్నారు. రాజ్యసభలో బిల్లు తెచ్చిన సోనియాకు, ఆమె ధైర్యానికి సెల్యూట్ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోల్డ్ స్టోరేజీలో ఉందన్నారు. మహిళా రిజర్వేషన్లపై ఢిల్లీలో రేపు దీక్షా కార్యక్రమం చేపట్టామన్నారు.
అధికారంలోకి వస్తే మహిళా రిజర్వేషన్ల బిల్లును మోడీ అమలు చేస్తామని 2014, 2019లో చెప్పారని గుర్తు చేశారు. కానీ ఆ హామీ ఇప్పటి వరకు నెరవేరలేదన్నారు. ప్రభుత్వాలు మారినా మహిళా బిల్లుకు మోక్షం లేదన్నారు. మహిళా రక్షణ బిల్లు తేవాలన్నారు. రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ల కోసం ధర్నా చేపట్టామని తెలిపారు. మాకు ఈడీ నోటీసులు అందాయని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని కోరామని తెలిపారు. 11న ఈడీని ఇంటికి రావాలని కోరినట్లు తెలిపారు. తెలంగాణ నేతల్ని వేధించడం కేంద్రంలోని బీజేపీకి అలవాటుగా మారిందన్నారు.
మోడీ వన్ నేషన్, వన్ ఫ్రెండ్ అనే కొత్త స్కీం తెచ్చారని అదానీని ఉద్ధేశించి అన్నారు. ఉద్యమం చేసి వచ్చామని .. భయపడే వాళ్లం కాదన్నారు. మోడీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రతిపక్షాలపై కేసులు అన్నారు. విపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలన్నారు. దర్యాప్తును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎందుకు చేయరని, నిందితులతో కలిపి విచారణ చేయాల్సి వస్తే తనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలన్నారు. ఈడీ విచారణను ఎదుర్కొంటామన్నారు. ఈడీ ఎందుకింత హడావిడిగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదన్నారు.