ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకున్న శివయ్య.. ఎక్కడంటే? (ఫొటోలు వైరల్)

by Shiva |   ( Updated:2024-01-09 10:05:06.0  )
ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకున్న శివయ్య.. ఎక్కడంటే? (ఫొటోలు వైరల్)
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా‌పాలన కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది. ఆరు గ్యారెంటీల లబ్ధి పొందేందుకు జనం పంచాయతీ కార్యాలయాల ఎదుట క్యూ లైన్లలో నిలబడి దరఖాస్తులను అందజేస్తున్నారు. ఈ క్రమంలో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఏకంగా పరమ శివుడి పేరిట దరఖాస్తు ప్రజా పాలనలో అధికారులకు అందింది. అయితే, అందుకు సంబంధించిన దరఖాస్తు ఫారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో అర్జీదారు శివుడు కాగా, కుంటుంబ వివరాల కాలమ్‌లో భార్య పార్వతి, కుమారుల పేర్లు కుమార స్వామి, వినాయకుడు అని రాసి ఉంది. ఇది ఎవరో కావాలనే అకతాయిలు చేశారా, లేక స్వయంగా పరమ శివుడే వచ్చి ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకున్నాడా అని ట్విట్టర్‌లో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Advertisement

Next Story