Murali Akunuri: ఇప్పుడు కూడా ఏంటండీ.. బుద్ది ఉందా? పోలీసులపై మాజీ ఐఏఎస్ ఫైర్

by Ramesh Goud |
Murali Akunuri: ఇప్పుడు కూడా ఏంటండీ.. బుద్ది ఉందా? పోలీసులపై మాజీ ఐఏఎస్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇప్పుడు కూడా ఇలాంటివి ఏంటండీ ? బుద్ది ఉందా? అంటూ.. తెలంగాణ ను థర్డ్ డిగ్రీ చిత్రహింసల ఫ్రీ రాష్ట్రంగా తీర్చి దిద్దండి అని మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి అన్నారు. దళిత మహిళపై థర్డ్ డిగ్రీ!, నేరం ఒప్పుకోవాలని చిత్రహింసలు, షాద్ నగర్ పీఎస్ లో ఘటన అని దిశ దిన పత్రికలో వచ్చిన కథనంపై స్పందించిన ఆయన పోలీసుల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. ఇప్పుడు కూడా ఈ థర్డ్ డిగ్రీ చిత్రహింసలు ఏంటండీ ? బుద్ది ఉందా? అని మండిపడ్డారు. అలాగే బయటకు వచ్చినవి కొన్నే. బయటకు రానివి పది రెట్లు ఉంటాయని తెలిపారు.

దయచేసి బలహీన ప్రజలపై ఈ అకృత్యాలను ఆపాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. మీరు సెలవులు లేకుండా చాలా కష్టపడతారు కానీ ఇలాంటి దుర్మార్గాలతో డిపార్ట్మెంట్ అంత బదనాం అవుతుందని తెలిపారు. ప్రభుత్వం ఇలాంటి పోలిసుల మీద కఠినచర్యలు తీసుకోవాలని, డిపార్ట్మెంట్ క్రమశిక్షణ చర్యలతో పాటు చట్టపర చర్యలు తీసుకొని నిందితులను జైలుకి పంపాలని డిమాండ్ చేశారు. మరియమ్మ లాక్ అప్ డెత్ లో కూడా చట్టపర చర్యలు తీసుకోకుండా నిందిత పోలీసులను వదిలి పెట్టడం అన్యాయమని వ్యాఖ్యానించారు. దయచేసి తెలంగాణను థర్డ్ డిగ్రీ చిత్రహింసల ఫ్రీ రాష్ట్రంగా తీర్చి దిద్దాలని తెలంగాణ డీజీపీని రిక్వెస్ట్ చేశారు. ఇంకా ఎన్నాళ్ళు ? దయచేసి పోలీసులు దౌర్జన్యాలను ఆపండి అని తెలంగాణ సీఎంఓ ను ట్యాగ్ చేస్తూ మాజీ ఐఏఎస్ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story