- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ తరపున కార్యాచరణ ప్రకటిస్తాం.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు (BRS Leader Harish Rao) సమక్షంలో బీజేపీ నేతలు (BJP Leaders) బీఆర్‌ఎస్ (BRS)లో చేరారు. జహీరాబాద్ నియోజకవర్గం (Jaheerabad Constiency)లోని బీజేపీ నాయకులు ఎమ్మెల్యే మాణిక్ రావు (MLA Manik Rao) ఆధ్వర్యంలో, మాజీ మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. బీజేపీని వీడిన మాజీ సీడీసీ ఛైర్మన్ ఉమాకాంత్ పటేల్, మాజీ సహకార సంఘం అధ్యక్షుడు బస్వరాజు, మాజీ ఎంపీటీసీలు విజయేందర్ రెడ్డి, సంతోష్ పాటిల్, సీనియర్ నాయకులు సుభాష్ రావు, భూమయ్య, లక్ష్మయ్య సహా మరో 20 మంది ముఖ్య నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు.
వీరికి హరీష్ రావు బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణను బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, 8 మంది ఎంపీలను గెలిపించినా బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం చేసిందని ఆరోపించారు. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ (Adilabad Cement Factory)ను తుక్కు కింద అమ్ముతున్నారని, దక్షిణాది రాష్ట్రాల పట్ల బీజేపీ చిన్న చూపు చూస్తోందని, ముఖ్యంగా తెలంగాణాకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.
మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) విఫలమైందని, బీఆర్ఎస్ ప్రారంభించిన బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టు (Basaveshwara Samgameshwara Project)ను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందని అన్నారు. అలాగే సంగారెడ్డి జిల్లా (Sangareddy District) అభివృద్ధిని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తోందని, ఎస్డీఎఫ్, టీఫిఐడిసి నిధులను విడుదల చేయకుండా జిల్లా అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని వ్యాఖ్యానించారు. సంగమేశ్వర ప్రాజెక్టు పూర్తయితే జిల్లా మొత్తం సాగు నీటితో సస్యశ్యామలం అవుతుందని, బసవేశ్వర ప్రాజెక్టుపై త్వరలో బీఆర్ఎస్ తరపున కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఇక ప్రజల కోసం పోరాడే శక్తి బీఆర్‌ఎస్ మాత్రమే అని ప్రజలకు తెలుసని హరీష్ రావు అన్నారు.