కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో రెచ్చిపోయిన CM రేవంత్.. ప్రధాని మోడీపై ఘాటు వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో రెచ్చిపోయిన CM రేవంత్.. ప్రధాని మోడీపై ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లోని అహ్మదాబాద్(Ahmedabad) వేదికగా జరుగుతున్న ఏఐసీసీ ప్లీనరీ(AICC Plenary) సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కులాలు, మతాల మధ్య ప్రధాని మోడీ(Prime Minister Modi) చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. దేశాన్ని విభజించాలని మోడీ చూస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశమంతా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కులగణన చేసి రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే రైతులకు రుణమాఫీ చేసినట్లు చెప్పారు. మోడీ, బీజేపీ నేతలు గాడ్సే సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

గాంధీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ బీజేపీ(BJP)ని అడుగుపెట్టనివ్వమని కీలక ప్రకటన చేశారు. గతంలో బ్రిటీష్ వాళ్లను దేశం నుంచి తరిమి కొట్టినట్లే బీజేపీనీ తరిమి కొట్టాలని.. ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయని హాట్ కామెంట్స్ చేశారు. ఈ ఏఐసీసీ సమావేశంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, సీతక్క, పొన్నం ప్రభాకర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పాల్గొన్నారు.



Next Story

Most Viewed