హాస్టల్ పిల్లలకు నాణ్యమైన భోజనం పెడుతున్నాం : స్పీకర్

by Kalyani |
హాస్టల్ పిల్లలకు నాణ్యమైన భోజనం పెడుతున్నాం : స్పీకర్
X

దిశ ప్రతినిధి వికారాబాద్ : జిల్లాలో ప్రభుత్వ వసతి గృహాలలో ఉంటున్న విద్యార్థులను వార్డెన్లు తమ స్వంత పిల్లలుగా భావించి వారికి ఆరోగ్యకరమైన ఆహారం అందించాలని తెలంగాణ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ హాల్ నందు జిల్లాలోని 104 ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ, ప్రభుత్వ, గురుకుల వసతి గృహాలకు శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి, లతో కలిసి రూ. 25 లక్షల విలువైన వంట సామాగ్రిని వార్డెన్ లకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని నిధులను సమీకరించి ప్రభుత్వ వసతి గృహాలకు వంట సామాగ్రిని అందించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ హాస్టల్ లలో వసతుల కల్పనకు ప్రభుత్వం నుంచి నిధులను మంజూరు చేయించడానికి నా వంతు కృషి చేస్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర బడ్జెట్ లో 7 శాతంకు పైగా నిధులను విద్యాశాఖకు కేటాయించిందని అన్నారు.

వంట సామాగ్రితో వసతి గృహాలలో వంటలు మరింత సులభంగా, పరిశుభ్రంగా చేయడానికి ఉపయోగపడుతాయని, విద్యార్థులకు పౌష్టికాహారం అందుతుందని అన్నారు. ప్రభుత్వ హాస్టళ్ళు, గురుకులాల్లో 8 లక్షల మంది వసతి పొందుతున్నారన్నారు. పదేళ్ల తర్వాత ప్రజా ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైట్ చార్జీలు 40 శాతం, కాస్మోటిక్ ఛార్జీలు 200 శాతం పెంచుతూ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందుతుంది. ప్రభుత్వ హాస్టళ్లలో సన్న బియ్యంతో అన్నం పెడుతున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహార పదార్థాలు సరిగ్గా పెడుతున్నారా లేదా అని పరిశీలించడానికి శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులు ప్రభుత్వ హాస్టళ్ళను నిరంతరం తనిఖీ చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని అన్నారు.

అన్ని వర్గాల పిల్లలు కలిసి మెలసి చదువుకోవడానికి అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక మొదటిసారి డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టిందన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో పాఠశాలలు, వసతి గృహాలను ఆధునికరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ ఉమా హారతి, అదనాలు కలెక్టర్ లు లింగ్యా నాయక్, సుదీర్, డిఆర్డిఏ శ్రీనివాస్. ఎస్సీ సంక్షేమ అధికారి మల్లేశం, ఉపేందర్, కమలాకర్ రెడ్డి, రేణుకా దేవి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed