- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
"మేమెంతో మాకు అంతా".. కులగణనపై మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: కులగణన(Caste Census) అనేది చరిత్రాకమైన నిర్ణయమని, మనమెంతో మనకంతా అన్నట్లుగా.. రాజకీయ, సామాజిక, విద్యా, ఉద్యోగాలలో వాటా కోసం కులగణన సర్వే చేపట్టడం జరిగిందని మంత్రి సీతక్క (Minister Seethakka) స్పష్టం చేశారు. కులగణనపై మీడియాతో మాట్లాడిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆమె.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. గతేడాది ఫిబ్రవరి 4న నిర్ణయం తీసుకొని చిత్తశుద్దితో కులగణన సర్వే నిర్వహించి, పది రోజుల పాటు కలెక్టర్లతో సహా అధికారులంతా సర్వేలో పాల్గొని పూర్తి చేసినట్లు తెలిపారు. కానీ కొన్ని వర్గాలు, రాజకీయ పార్టీలు కులగణన సర్వేలో కూడా పాల్గొనకుండా బీసీ (BC), దళిత (SC), గిరిజన (Tribes) కులాలను దారుణంగా అవమానించి, వారేదో ఉద్దరించినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
వందల ఏళ్ల నాటి అసమానతలు తొలగిపోవడానికి ఈ నివేదిక ఉపయోగపడుతుందని, భవిష్యత్ లో అణగారిన వర్గాల అభివృద్ది కోసం ఇంకా బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నానని అన్నారు. ఎవరి జనాబా ప్రకారం వారికి రిజర్వేషన్లు (Reservations) ఇవ్వాలని, కొన్నేళ్ల పాటు ఇది కొనసాగిస్తే అసమానతలు తొలిగి సమానత్వం దిశగా ముందడుగు పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంట్ (Pariament)లోని పీఎంవో ఆఫీస్ (PMO Office) లో దాదాపు 50 శాతం ఉన్నవర్గాల్లో కనీసం 2 శాతం కూడా లేరని, ఇది చూసి రాహుల్ గాంధీ (Rahul Gandhi) కలత చెంది, అందరికీ ప్రాధాన్యం దక్కాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారని తెలిపారు.
దీనిని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) యుద్ద ప్రతిపాధికన పూర్తి చేసినందుకు దన్యవాదాలు తెలియజేశారు. దీనిపై ఆమె.. ఆనాడు సమసమాజ స్థాపనకు అంబేద్కర్ (Ambedkar) కలలు కన్నారని, నేడు మా నాయకుడు రాహుల్ గాంధీ అదే సంకల్పంతో కుల గణన అనే నినాదంతో ముందుకు సాగుతున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట కులగణన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. “మేమెంతో మాకు అంతా” జనాభా ప్రాతిపాదిక ప్రకారం సామాజిక, ఆర్ధిక, రాజకీయ ఫలాలు సమానంగా పొందే అవకాశం లభిస్తుందని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో నేడు అధికారికంగా అసెంబ్లీ సాక్షిగా ప్రజల ముందుకు తీసుకొస్తున్నామని, రాజ్యాంగ బద్ధంగా అన్ని వర్గాలకు సామాజిక, ఆర్ధిక, రాజకీయ సమానత్వం పొందగలిగిన రోజున అసలైన అభివృద్ధి జరుగుతుందని సీతక్క రాసుకొచ్చారు.