ప్రత్యేక పాలనలో దోమల బెడద.. అధికారుల అలసత్వం

by Aamani |
ప్రత్యేక పాలనలో దోమల బెడద.. అధికారుల అలసత్వం
X

దిశ,కన్నాయిగూడెం : మండలం తో పాటు పలు గ్రామాల్లో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ప్రత్యేక పాలనలో నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు దృష్టి సారించడం లేదు. అసలే వర్షాకాలం అపరిశుభ్రత ఆపై చీకటి పడితే చాలు ఏ వార్డు కు వెళ్లిన దోమల మోత వినిపిస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పల్లెల్లో ప్రధాన రోడ్లతో పాటు, వార్డు అంతర్గత రోడ్లులో వర్షం నీరు చేరడంతో దోమలకు నిలయంగా మారుతున్నాయి.

ప్రత్యేక పాలనలో అలసత్వం..

వర్షాకాలం వచ్చిందంటే సర్పంచులు గ్రామపంచాయతీలో బ్లీచింగ్ పౌడర్ చల్లించేవారు. కానీ ప్రత్యేక పాలనలో అది కనిపించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.వీధుల్లో వీధి దీపాలు లేవు సమస్యలతో ప్రజలు సతమతమవుతున్న ప్రత్యేక పాలనలో అధికారులు, గ్రామ కార్యదర్శులు పట్టించుకోవడం లేదంటూ మండలంలోని పలు గ్రామాల్లోని ప్రజలు మండిపడుతున్నారు. మండలంలోని ఏ గ్రామానికి వెళ్లి చూసినా వార్డులో రోడ్ల పక్కనే చెత్త చెదారంతో దోమలు తిష్ట వేస్తున్నాయని దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లో ఉన్న వాటర్ ట్యాంకులలో చెత్త చెదారం, మురికి నీరు వస్తుందని అధికారులకు పలుమార్లు చెప్పిన పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ప్రతి ఏటా వర్షాకాలంలో దోమల నివారణకు ఫాగింగ్ యంత్రాలతో నివారణ చర్యలు చేపట్టే వారిని, ప్రస్తుతం అది కనిపించడం లేదని మండలం లోని పలు గ్రామాల ప్రజలు అంటున్నారు.

మూలన పడిన యంత్రాలు..

పలు గ్రామ పంచాయతీలలో ఫాగింగ్ యంత్రాలు ఉన్న ప్రత్యేక పాలనలో వాటిని ముట్టుకోవడం లేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో పట్టించుకోవడంలేదని అంటున్నారు.ఇప్పటికైనా పరిశుభ్రత పై దృష్టి సారించకుంటే దోమలు వ్యాప్తి చెంది రోగాలు బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు దోమల నివారణ చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed