- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలాపూర్ లడ్డూ వేలం పాటకు గ్రామస్తుల నుంచి తీవ్రమైన పోటీ.. కొత్త రూల్స్ పెట్టిన నిర్వాహకులు
దిశ, వెబ్‌డెస్క్: వినాయక చవితి అంటే చాలు హైదరాబాద్ నగరంలో గుర్తకువచ్చేది.. ఖైరతాబాద్ మహాగణపతి, బాలాపూర్ లడ్డూ వేలం. కాగా ఖైరతాబాద్ మహాగణపతిని చూసేందుకు ప్రజలు పోటీ పడగా.. బాలాపూర్ మాత్రం లడ్డూ వేలం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ క్రమంలో బాలాపూర్ లడ్డూ వేలం పై యావత్ తెలంగాణ ప్రజలు దృష్టి సారించారు. కాగా ఈ సంవత్సరం బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలం 30 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో గ్రామస్థుల నుంచి లడ్డూ వేలం పాటకు తీవ్రమైన పోటీ ఏర్పడింది. దీంతో.. లడ్డూ వేలంలో ఈసారి కొత్త నిబంధన నిర్వాహకులు తీసుకొచ్చారు. కొత్త రూల్ ప్రకారం.. లడ్డూ వేలం పాటలో పాల్గోనలనుకునే పోటీదారులు ముందుగా డబ్బు డిపాజిట్ చేయాలని షరతు విధించారు. కాగా.. గత సంవత్సరం బాలాపూర్ లడ్డూ రూ.27 లక్షలు పలికింది. ఈ సంవత్సరం రూ.30 లక్షలు పలుకుతుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే గత సంవత్సరం లడ్డూ దక్కించుకున్న వ్యక్తి తనకు మంచి జరిగిందని, ఎన్ని లక్షలు అయిన పెట్టి బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకుంటానని ఆయన మీడియాతో చెప్పుకొచ్చారు.