Thorrur : ప్రొఫెసర్ జయశంకర్‌‌ను మరిచిన తొర్రూరు మున్సిపాలిటీ

by Aamani |
Thorrur : ప్రొఫెసర్ జయశంకర్‌‌ను మరిచిన తొర్రూరు మున్సిపాలిటీ
X

దిశ, తొర్రూరు: ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ చుక్కను తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి చాటిన మహా జ్ఞాని తెలంగాణ సిద్దాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని తోర్రుర్ మున్సిపాలిటీ అధికారులు యాది మరిచారు.మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలో 90వ జయశంకర్ జయంతి సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు కూడా చేయలేదు. ప్రభుత్వం నుంచి చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి అఫీషియల్ గా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన కూడా మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదు.ప్రతి ఏడాది ఈ ప్రభుత్వం ఉన్న అంగరంగ వైభవంగా జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేవారు.కానీ ఈ ఏడాది మాత్రం జయశంకర్ సారును తొర్రూరు మున్సిపాలిటీ యాది మరిచారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జయశంకర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న,తొర్రూరు మున్సిపాలిటీ మాత్రం నాకేంటి నన్ను అడిగేవారు లేరు అంటు వ్యవహరిస్తున్నారు.వెంటనే తొర్రూరు మున్సిపాలిటీపై సంబంధిత అధికారులు స్పందించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

కలెక్టర్ నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు : శాంతి కుమార్ తోరూర్ మున్సిపల్ కమిషనర్

ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించామని మాకు ఎటువంటి ఆదేశాలు కలెక్టర్ జారీ చేయలేదు కాబట్టి మేము అధికారికంగా జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించడం లేదు.

Advertisement

Next Story