- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సొంత అన్న ఇంటిలోనే చోరీకి పాల్పడిన తమ్ముడి అరెస్ట్..
దిశ, నర్సంపేట: సొంత అన్న ఇంటిలోనే చోరీకి పాల్పడిన తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోనాపురం గ్రామానికి చెందిన మండల రవి రోజువారీ కూలి పనిచేస్తూ, వచ్చిన డబ్బులతో మద్యం సేవిస్తూ, జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో అప్పులు కూడా అధికంగా చేశాడు. కొన్ని రోజుల క్రితం ఇదే గ్రామంలో నిందితుడి అన్నయ్య మండల సుధాకర్ కుమారుడికి పెళ్లి జరిగింది.
ఇది ఇలా ఉండగా రవికి అప్పులు ఇచ్చిన వాళ్ళ ఒత్తిడి ఎక్కువైంది. అన్న కుమారుడి పెళ్లి జరగడం, వాళ్ళు వేములవాడకు వెళ్లడంతో ఇంట్లో బంగారం ఎక్కువ ఉంటుందని నిందితుడు రవి పథకం వేశాడు. అదును చూసి ఈ నెల 26వ తేదీన ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తలుపులు తొలిగించి ఇంటిలో బీరువా తాళాలు పగుల గొట్టాడు. బీరువాలోని బంగారం, డబ్బును కాజేశాడు. తెలివిగా తలుపులు తొలగించి ఉన్నట్టు తన తల్లికి సమాచారం అందించాడు. వేములవాడ నుంచి వచ్చిన సుధాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నెక్కొండ ఇన్ స్పెక్టర్ హాతీరాం నేతృత్వంలో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సుధాకర్ తమ్ముడు రవి దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి 75 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు రూ. లక్ష 40వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన నర్సంపేట ఏసీపీ సంపత్ రావు, నెక్కొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ హతీరాం, చెన్నారావుపేట ఎస్ఐ టి.మహేందర్, కానిస్టేబుల్ కత్తి సురేష్, సిబ్బందిని ఈస్ట్ జోన్ డీసీపీ అభినందించారు.